యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ను వ్యతిరేకిస్తున్నాం: సీఎం కేసీఆర్

Published : Jul 11, 2023, 05:12 AM IST
యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ను వ్యతిరేకిస్తున్నాం: సీఎం కేసీఆర్

సారాంశం

యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ని పార్లమెంట్‌లో ప్రవేశపెడితే తమ పార్టీ వ్యతిరేకిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఇప్పటికే దేశాభివృద్ధిని విస్మరించి ప్రజలను వివిధ మార్గాల్లో ఇబ్బందులకు గురిచేస్తోందని, యుసిసి పేరుతో దేశ ప్రజలను విభజించడానికి మళ్లీ కుట్రలు పన్నుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఇటీవల యూనిఫాం సివిల్ కోడ్ గురించి దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అనేక రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తుండగా, కొన్ని పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ కూడా దీన్ని వ్యతిరేకించింది. పార్లమెంట్‌లో యూనిఫాం సివిల్‌ కోడ్‌ను ప్రవేశపెడితే.. తాము వ్యతిరేకిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.  దీంతో పాటు బిల్లును వ్యతిరేకించేందుకు తాము ఇతర పార్టీలను కూడా ఏకం చేయనున్నారు.

సోమవారం ప్రగతిభవన్‌లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) ప్రెసిడెంట్ ఖలీద్ సైఫుల్లా రహ్మానీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్ ఈ బిల్లు సహా పలు అంశాలపై చర్చించారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును బీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తుందని.. భావ సారూప్య పార్టీలతో కలిసి దీనిపై పోరాడుతుందని స్పష్టం చేశారు. 

దేశ సమగ్రతకు విఘాతం కలిగించే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు.  బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో దేశ అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించింది. బీజేపీ ప్రజలను రకరకాలుగా ఇబ్బంది పెడుతోంది. యూసీసీ పేరుతో ప్రజలను విభజించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.

భారతదేశ ఐక్యత ప్రపంచంలోనే ఒక ఉదాహరణ. అందువల్ల, దానిని రక్షించడానికి, బిల్లును తిరస్కరించడం అవసరం. బిల్లును ప్రవేశపెట్టి ప్రజలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఇప్పటికే దేశాభివృద్ధిని విస్మరించి ప్రజలను వివిధ మార్గాల్లో ఇబ్బందులకు గురిచేస్తోందని, యుసిసి పేరుతో దేశ ప్రజలను విభజించడానికి మళ్లీ కుట్రలు పన్నుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రసిద్ధి చెందిన దేశ ప్రజలను విభజించాలనే కేంద్రం నిర్ణయాన్ని తమ పార్టీ నిస్సందేహంగా వ్యతిరేకిస్తుందని, తదనుగుణంగా తమ పార్టీ యుసిసిని వ్యతిరేకిస్తుందని చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్