హైద్రాబాద్‌లో దారుణం: రాత్రి ఫోన్ మాట్లాడుతుందని కూతురును చంపిన తండ్రి

Published : Dec 18, 2022, 12:00 PM IST
హైద్రాబాద్‌లో దారుణం: రాత్రి ఫోన్ మాట్లాడుతుందని  కూతురును చంపిన  తండ్రి

సారాంశం

హైదరాబాద్ ముషీరాబాద్ లో కూతురును  హత్య చేశాడు  తండ్రి. రాత్రిపూట ఫోన్ మాట్లాడుతున్నందుకు గాను కూతురిని గొంతు నులిమి చంపాడు తండ్రి సాధిక్.  

హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్ లో  ఆదివారం నాడు దారుణం చోటు చేసుకుంది. రాత్రి పూట మొబైల్ లో మాట్లాడుతుందని  కూతురును గొంతు నులిమి చంపాడు తండ్రి.పలుమార్లు మందలించినా కూడా కూతురు  ఉన్నిసా వైఖరిలో మార్పు రాలేదు.  శనివారం నాడు రాత్రి కూడ  మొబైల్ లో మాట్లాడడాన్ని తండ్రి సాధిక్ గుర్తించాడు. వెంటనే ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.రాత్రి పూట మొబైల్ లో మాట్లాడొద్దని చెప్పినా వినలేదని పట్టరాని కోపంతో  కూతురు గొంతు నులిమాడు  తండ్రి సాధిక్. దీంతో   కూతురు ఉన్నిసా మరణించింది.  ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సాధిక్ ను   అరెస్ట్  చేశారు.  మృతదేహన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం  గాంధీ ఆసుపత్రికి తరలించారు.  క్షణికావేశంలో ఉన్నిసా హత్య జరిగిందా లేదా  ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPS Officer Uday Krishna Reddy Controversy Explained | Harassment Allegations & Viral Letter
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక ఈ జిల్లాలలో భారీ వర్షాలు| Big Alert for AP & Telangana