హృదయవిధారక ఘటన... కన్న కూతురు పెళ్లిలోనే కుప్పకూలి తండ్రి మృతి

Published : May 25, 2023, 12:50 PM ISTUpdated : May 25, 2023, 12:51 PM IST
హృదయవిధారక ఘటన... కన్న కూతురు పెళ్లిలోనే కుప్పకూలి తండ్రి మృతి

సారాంశం

కన్నకూతురు పెళ్ళి జరుగుతుండగా మండపంలోనే కుప్పకూలి తండ్రి మృతిచెందాడు. ఈ హృదయవిదారక ఘటన గోదావరిఖనిలో చోటుచేసుకుంది. 

పెద్దపల్లి : కన్నకూతురి పెళ్లిలోనే తండ్రి కుప్పకూలి మృతిచెందిన విషాదం పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వైభవంగా కూతురు పెళ్లి జరుగుతుండగా మండపంలోనే తండ్రి మృతిచెందడంతో ఆనందమంతా ఆవిరై విషాదం నిండిపోయింది. అప్పటివరకు పెళ్లిబాజా మోగిన ఇంటివద్దే చావుబాజా మోగింది. 

వివరాల్లోకి వెళితే...  పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి శంకర్ వివిధ మిడియా సంస్థల్లో జర్నలిస్ట్ గా పనిచేసాడు. కొంతకాలంగా అతడు అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితం అయ్యాడు. అయితే అతడి కూతురు పెళ్లి బుధవారం గోదావరిఖనిలోని సింగరేణి  కమ్యూనిటీ హాల్ లో ఘనంగా జరిగింది. బంధుమిత్రుల సందడి మధ్య కూతురు పెళ్లి కోలాహలంగా జరిగింది. ఈ పెళ్ళి మండపంలోనే అతిథులతో మాట్లాడుతూ శంకర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిని గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి తరలించినా శంకర్ ప్రాణాలు దక్కలేవు. వైద్యులు మెరుగైన చికిత్స అందించినా ప్రాణాలు కోల్పోయాడు. 

కూతురు పెళ్లి వేడుకలోనే తండ్రి మృతిచెందడంలో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు శంకర్ మృతివార్తతో దిగ్భ్రాంతికి గురయ్యారు. కూతురు అప్పగింతలు కూడా ముగియకుండానే శంకర్ మృతిచెందడం అందరినీ కలచివేసింది. 

Read More  కదులుతున్న రైలు నుంచి పడి.. హైదరాబాద్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు మృతి..

పోస్టుమార్టం అనంతరం శంకర్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో అప్పటివరకు పెళ్లిబాజాలు మోగిన ఇంటిముందు చావుబాజా మోగిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. కూతురు పెళ్లి ఆనందం కొన్నిగంటలైన నిలవకముందే శంకర్ మృతిచెందడంతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది.  


 

PREV
click me!

Recommended Stories

Hyderabad History: నిజాంలనాటి చివరిగుర్తులు, మిగిలింది ఇవే..
KTR Speech: అందుకే కేసీఆర్ అప్పు చేశారు | BRS Sarpanches Program at Khammam | Asianet News Telugu