రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందే.. గాంధీ భవన్ ముట్టడికి యాదవ జేఏసీ నేతల పిలుపు.. టెన్షన్.. టెన్షన్..

By Sumanth KanukulaFirst Published May 25, 2023, 11:42 AM IST
Highlights

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై యాదవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. యాదవ, కురుమలను అవమానించేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని.. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.


టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై యాదవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. యాదవ, కురుమలను అవమానించేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని.. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రేవంత్ రెడ్డికి వారు విధించిన డెడ్‌ లైన్ ముగియనుండటంతో.. వారు నిరసనను ఉధృతం చేశారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఈరోజు గాంధీ భవన్ ముట్టడికి యాదవ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. 

ఇందిరా పార్క్‌ నుంచి గాంధీ భవన్ వరకు వెళ్లాలని వారు నిర్ణయించారు. ఈ క్రమంలోనే గాంధీ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి మాత్రం తాను ఏం తప్పుగా మాట్లాడలేదని.. క్షమాపణ చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. రేవంత్‌కు మద్దతుగా అంజనీ కుమార్ నిలిచారు. రేవంత్ రెడ్డి యాదవ్‌ల ప్రస్తావన తీయలేదని అన్నారు.  కేవలం తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించే విమర్శలు చేశారని తెలిపారు. 
 

click me!