కూతురి అస్థికలు ఆరేళ్లపాటు దాచిన తండ్రి.. చివరికి..

By AN Telugu  |  First Published Mar 30, 2021, 3:07 PM IST

ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లి, అక్కడే స్థిరపడ్డా పుట్టిపెరిగిన మూలాలు మరవలేదు ఆ కరీంనగర్ వాసి. అనారోగ్యంతో ఆరేళ్ల క్రితం ఇంగ్లాండ్ లో చనిపోయిన కూతురి అస్థికలు భద్రపరిచాడు. ఆరేళ్ల తరువాత భారత్ కు తిరిగి వచ్చాక.. కాలేశ్వరం నదిలో అస్తికలు కలిపాడు.

వివరాల్లోకి వెడితే కరీంనగర్ జిల్లా మంకమ్మతోటకు చెందిన యశ్వంత్ కొన్నేళ్ల క్రితం ఉన్నత చదువులకోసం ఇంగ్లాండ్ కు వెళ్లాడు. అక్కడే ఇంగ్లాండ్ కు చెందిన ఫియానాను ప్రేమించి, పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

Latest Videos

undefined

ఆ తర్వాత అక్కడే స్థిరపడ్డాడు. వారికి మొదట వివాన్ అనే కుమారుడు, ఆ తరువాత జీనా, ఆంజీ అని కవల కుమార్తెలు జన్మించారు. అయితే ఆరేళ్ల కిందట కవలల్లో ఒకరైన ఆంజీ అనారోగ్యంతో చనిపోయింది. 

అయితే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను బాగా పాటించే యశ్వంత్.. తన కుమార్తె భారత్ లో ని నదీ జలాల్లోనే కలపాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం ఆస్తికల్ని అలాగే భద్రపరిచి పెట్టాడు. 

ఆరేళ్ల తరువాత స్వస్థలానికి వచ్చిన యశ్వంత్.. సోమవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా, మహాదేవ్ పూర్ మండలం కాళేశ్వరంలో ఆంజీ ఆస్తికలకు ప్రత్యేక పూజలు నిర్వహించాక త్రివేణి సంగమమైన గోదావరిలో కలిపాడు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఇంగ్లండ్ వెళ్లినా భారత సంస్కృతిని మరిచిపోయి యశ్వంత్ ను పలువురు అభినందించారు. 

click me!