జగిత్యాల మాస్టర్ ప్లాన్: తిమ్మాపూర్ గ్రామ పాలకవర్గం రాజీనామా, రోడ్డుపై బైఠాయించిన రైతులు

By narsimha lodeFirst Published Jan 16, 2023, 2:55 PM IST
Highlights

జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  రైతులు ఇవాళ ఆందోళనకు దిగారు.  జగిత్యాల- నిజామాబాద్  రోడ్డుపై బైఠాయించి  నిరసన చేపట్టారు.  మాస్టర్ ప్లాన్  ను వెంటనే  వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్  చేస్తున్నారు.


జగిత్యాల:మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  జగిత్యాల-నిజామాబాద్   హైవేపై   రైతులు   సోమవారంనాడు  రాస్తారోకో  నిర్వహించారు. దీంతో  ఈ రహదారిపై భారీగా  వాహనాలు నిలిచిపోయాయి.  మాస్టర్ ప్లాన్ ను  వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తో తిమ్మాపూర్  గ్రామ సర్పంచ్ సహా  వార్డు సభ్యులు  రాజీనామా చేశారు. జిల్లాలోని తిప్పన్నపేటకు  చెందిన  రైతులు ఆందోళన నిర్వహించారు.

ఇప్పటికే  కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  కామారెడ్డి  మాస్టర్ ప్లాన్ ను వెనక్కి తీసుకోనేవరకు  ఆందోళన నిర్వహించాలని  కామారెడ్డి  రైతు జేఏసీ నిర్ణయం తీసుకుంది.  మాస్టర్ ప్లాన్  పరిధిలోకి వచ్చే  గ్రామాలకు చెందిన కౌన్సిలర్లు రాజీనామాలు చేయాలని  రైతు జేఏసీ ఆందోళనలు నిర్వహించనుంది.  

also read:జగిత్యాల కొత్త మాస్టర్ ప్లాన్ : మున్సిపల్ కార్యాలయం ముందు మూడు గ్రామాల రైతుల ధర్నా

కామారెడ్డి  జేఏసీ  ఆందోళనలు కొనసాగుతున్న తరుణంలోనే  జగిత్యాల  మాస్టర్ ప్లాన్ కు  వ్యతిరేకంగా  రైతులు  రోడెక్కారు. కొన్ని రోజుల క్రితం  ఈ మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  జగిత్యాల మున్సిపల్ కార్యాలయం  ముందు  రైతులు ఆందోళన నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ ఫ్లెక్సీని  చించేశారు.  ఫ్లెక్సీకి నిప్పు పెట్టారు. జగిత్యాల మున్సిపల్  కార్యాలయంలోపలికి చొచ్చుకెళ్లేందుకు  ప్రయత్నించారు. అయితే ఆందోళనకారులను  పోలీసులు నిలువరించారు.

మాస్టర్ ప్లాన్ లకు వ్యతిరేకంగా  రైతులు ఆందోళనలు నిర్వహించడం  స్థానిక అధికార పార్టీకి చెందిన  ప్రజాప్రతినిధులకు  ఇబ్బందిగా మారింది.  కామారెడ్డి  మాస్టర్ ప్లాన్  పరిధిలో  ఏడు గ్రామాలున్నాయి.  ఎల్లారెడ్డి, కామారెడ్డి  నియోజకవర్గాలకు  చెందిన ఎమ్మెల్యేలు రైతులకు  నచ్చజెప్పే ప్రయత్నాలు  చేశారు. అయితే  ఈ విషయమై  ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు  తమ ఆ:దోళనను కొనసాగిస్తామని రైతు జేఏసీ ప్రకటించింది.   మాస్టర్ ప్లాన్  లను  నిరసిస్తూ  రైతులు చేపట్టిన ఆందోళనలకు  బీజేపీ, కాంగ్రెస్ లు మద్దతును ప్రకటించాయి. కామారెడ్డి మాస్టర్ ప్లాన్  విషయంలో  రైతులు నిర్వహించిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి.  మాస్టర్ ప్లాన్  ను నిరసిస్తూ  హైకోర్టులో  రైతులు పిటిషన్ కూడా  దాఖలు చేశారు.

click me!