నేను ఎక్కడికి వెళ్లడం లేదు.. ఐక్యంగా ఉంటే కొందరు చూడలేక పోతున్నారు: మంత్రి పువ్వాడ సంచలన వ్యాఖ్యలు

Published : Jan 16, 2023, 01:42 PM IST
 నేను ఎక్కడికి వెళ్లడం లేదు.. ఐక్యంగా ఉంటే కొందరు చూడలేక పోతున్నారు: మంత్రి పువ్వాడ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు.

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభ సన్నాహక సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. ఖమ్మంలో కొద్దిమంది పనికిమాలిన బ్యాచ్ ఉందని కొందరు సొంత పార్టీ నేతలను ఉద్దేశించి కామెంట్ చేశారు. బీజేపీలో ఉన్నట్టే ఖమ్మం బీఆర్ఎస్‌లో కూడా ఒక అబద్దాల గ్రూప్‌ ఉందని అన్నారు. వాళ్లకు అబద్దాలు చెప్పడం తప్ప ఇంకేమీ తెలియదని అన్నారు. తనకు ఉన్న సైన్యాన్ని చూసి భయపడుతున్నారని అన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసేవాళ్లనే కూకటివేళ్లతో పేకిలిస్తానని చెప్పారు

ఖమ్మంను అద్బుతంగా అభివృద్ది చేసుకున్నామని.. కార్యకర్తలు, నాయకులు వారి గుండెల్లో స్థానం ఇస్తే తాను కూకట్‌పల్లి ఎందుకు వెళ్తానని ప్రశ్నించారు. ఐక్యంగా ఉంటే కొందరు చూడలేక పోతున్నారని మండిపడ్డారు. ఇక, మరో రెండు రోజుల్లో ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ జరగనున్న వేళ.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన ఈ కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu