వనస్థలిపురం దోపిడీ కేసును చేధించిన పోలీసులు.. నలుగురు అరెస్ట్.. వెలుగులోకి హవాలా రాకెట్

By Sumanth KanukulaFirst Published Jan 16, 2023, 2:14 PM IST
Highlights

వనస్థలిపురం దోపిడి కేసును పోలీసులు చేధించారు.  ఈ ఘటనకు సంబంధించి రూ. 25 లక్షలను సీజ్ చేయడంతో పాటు.. నలుగురిని అరెస్ట్ చేశారు. 

వనస్థలిపురం దోపిడి కేసును పోలీసులు చేధించారు.  ఈ ఘటనకు సంబంధించి రూ. 25 లక్షలను సీజ్ చేయడంతో పాటు.. నలుగురిని అరెస్ట్ చేశారు. బార్ యజమానికి వెంకట్ రెడ్డి వద్ద అప్పు తీసుకన్న వ్యక్తులే.. అప్పు తీర్చేందుకు డబ్బులు కొట్టేయాలని ప్లాన్ వేశానని చేశారని పోలీసులు తెలిపారు. వనస్థలిపురంలో దోపిడి కేసు నిందితులను సీసీటీవీ కెమెరాల ఆధారంగా గుర్తించామని వెల్లడించారు. దోపిడి తర్వాత నిందితులు ఇతర రాష్ట్రాలకు పారిపోయినట్టుగా చెప్పారు. అక్కడి నుంచి నిందితులు విదేశాలకు పారిపోయే క్రమంలో వారిని పట్టుకున్నట్టుగా చెప్పారు. ఐదుగురు నిందితుల్లో నలుగురిని అరెస్ట్ చేయగా.. మరొకరు పరారీలో ఉన్నట్టుగా తెలిపారు. 

ఇక, ఈ కేసు విచారణలో భాగంగా.. పెద్ద మొత్తంలో వాహలా రాకెట్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. వాహలా రూపంలో కోట్లాది రూపాయలు అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్టుగా రాచకొండ పోలీసులు గుర్తించారు. ఇక, వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారి దోపిడీ జరిగినట్టుగా వెంకట్ రెడ్డి అనే వ్యక్తి ఇటీవల పోలీసులకు  ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తొలుత కొందరు వ్యక్తులు తన వద్ద నుంచి రూ.2 కోట్లను లాక్కెళ్లారని, ఆ తర్వాత రూ.50 లక్షలు మాత్రమే తీసుకెళ్లారని వెంకట్ రెడ్డి  చెప్పడంతో పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టిసారించారు. అనుమానంతో పోలీసులు వెంకట్రామిరెడ్డిని ప్రశ్నించారు. మరోవైపు వెంకట్రామి రెడ్డి ఇంట్లో సోదాలు జరిపి లెక్కల్లో చూపని నగదును కూడా స్వాధీనం చేసుకన్నారు. 

ఇంత పెద్ద మొత్తంలో నగదు నిల్వ ఉంచినందుకు వెంకట్ రెడ్డి  సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయాడు. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు జరపగా.. తాను బార్ అండ్ రెస్టారెంట్ ముసుగులో నిర్వహిస్తున్న హవాలా లావాదేవీలలో పాల్గొన్నట్లు అంగీకరించాడు. వాట్సాప్ చాట్‌లు, డైరీలోని మునుపటి ఆర్థిక లావాదేవీల వివరాలు, కొన్ని రికార్డుల సహాయంతో.. అక్రమ హవాలా వ్యాపారంలో మరికొందరి ప్రమేయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. 

click me!