ఈ నెల 14న హలియాలో కేసీఆర్ సభ: హైకోర్టులో రైతుల పిటిషన్

By narsimha lodeFirst Published Apr 12, 2021, 2:16 PM IST
Highlights

హలియాలో ఈ నెల 14వ తేదీన సీఎం కేసీఆర్ పాల్గొనే సభకు స్థానికంగా అడ్డంకులు తప్పేలా లేవు.ఈ సభ నిర్వహణకు అనుమతి ఇవ్వవద్దని స్థానిక రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

నల్గొండ: హలియాలో ఈ నెల 14వ తేదీన సీఎం కేసీఆర్ పాల్గొనే సభకు స్థానికంగా అడ్డంకులు తప్పేలా లేవు.ఈ సభ నిర్వహణకు అనుమతి ఇవ్వవద్దని స్థానిక రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 14వ తేదీన సీఎం కేసీఆర్ హలియాలో నిర్వహించే సభలో పాల్గొనేలా టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.

అయితే హలియాలో రెండోసారి సీఎం కేసీఆర్ సభలో పాల్గొనడమంటేనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్టేనని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.హలియాలో తమ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే సీఎం సభకు  ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపిస్తూ కొందరు రైతులు సోమవారం నాడు  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కోవిడ్ సమయంలో లక్ష మందితో సభ ఎలా నిర్వహిస్తారని ఆ పిటిషన్ లో రైతులు ప్రశ్నించారు.

ఈ నెల 17వ తేదీన నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.ఈ స్థానానికి ఈ నెల 15వ తేదీ వరకు ప్రచారం చేసుకొనేందుకు  ఈసీ అనుమతి ఇచ్చింది. ఎన్నికల ప్రచారానికి గడువుకు ముందు రోజు హలియాలో టీఆర్ఎస్ ఎన్నికల సభ ను ఏర్పాటు చేసింది.ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్ హలియాలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు వరాలు కురిపించారు. 
 

click me!