సిఎం క్యాంపు ఆఫీసు ముందు మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం

Published : Jul 13, 2017, 06:11 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
సిఎం క్యాంపు ఆఫీసు ముందు మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం

సారాంశం

సిఎం క్యాంపు ఆఫీసు ముందు రైతు కుటంబం ఆత్మహత్యాయత్నం పరిస్థితి సీరియస్ ఆసుపత్రికి తరలింపు సిఎంఆర్ఎఫ్ కోసం సిఎంను కలిసేందుకు వెళ్లిన రైతు ఫ్యామిలి

తెలంగాణ సిఎం కెసిఆర్ క్యాంపు ఆఫీసు ముందు మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. నల్లగొండకు చెందిన ఒక రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో రాజధానిలో చర్చనీయాంశమైంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

 

సిఎంఆర్ఎఫ్ కోసం నల్గొండ జిల్లా కు చెందిన రైతు నాగరాజు (40) కుటుంబం బేగంపేటలోని కెసిఆర్ క్యాంపు ఆఫీసుకు గురువారం వచ్చారు. నాగరాజుతోపాటు ఆయన కూతురు నవ్య (13), మేనల్లుడు శ్రీనివాస్ (18) కూడా వచ్చారు. అయితే ఆ సమయంలో సిఎంను కలవడం కుదరదని సెక్యూరిటీ సిబ్బంది అన్నారు. సిఎం లేడని చెప్పారు. కనీసం లోపలికి వెళ్లేందుకు వీలు లేదని నిరాకరించడంతో నాగరాజు కుటుంబం తమతో తెచ్చుకున్న పురుగల మందును పోలీసుల ముందే తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.  దీంతో వారిని గుర్తించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే రైతు కూతురు నవ్య ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Telangana Jobs : తెలుగు యువతకు సూపర్ ఛాన్స్ ... నెలనెలా రూ.81.400 శాలరీతో గవర్నమెంట్ జాబ్స్
తెలుగోళ్లకు మాత్రమే ఈ ఆఫర్.. SBI లో అకౌంట్ ఉంటే చాలు కోటి రూపాయలు