గ్రూప్ 2 రద్దు కోసం హైకోర్టులో కేసు

First Published Jul 13, 2017, 12:31 PM IST
Highlights
  • గ్రూప్ 2 రద్దు కోసం హైకోర్టుకు అభ్యర్థులు
  • కొత్త నోటిఫికేషన్ ఇచ్చి పోస్టుల భర్తీ చేపట్టాలి
  • పిటిషన్ వేసిన అడ్వొకెట్ రచనా రెడ్డి
  • టిఎస్సిఎస్సికి హైకోర్టు నోటీసులు

తెలంగాణ ప్రభుత్వం తొలిసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీపై వివాదాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే గ్రూప్ 2 వ్యవహారం కోర్టులో పెండింగ్ లో ఉంది. తాజాగా గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా మరో నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల భర్తీ చేపట్టాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.

 

గ్రూప్ 2 అభ్యర్థుల తరుపున న్యాయవాది రచనా రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 2 ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కోర్టుకు నివేదించారు రచనారెడ్డి. గతంలో టిఎస్సిఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష లో OMR  షీట్ లో కోడింగ్,ఢీ కోడింగ్ విధానం లేదని దీనివల్ల అనేక అక్రమాలు జరిగాయన్నారు పిటిషనర్.

 

బబ్లింగ్,రీ బబ్లింగ్ ఎంతమంది చేశారు అనేది కూడా తెలియదని, అందులో సెక్యురిటి ఫీచర్స్ ఏ మాత్రం లేవని హైకోర్టు తెలిపిన పిటిషనర్ తరపు న్యాయవాది రచన రెడ్డి. దీనిపై ఈరోజు విచారించిన హైకోర్టు మూడు వారాల్లో కౌంటర్ ధాఖలు చేయాలంటూ టిఎస్సిఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.

click me!