శంకర్ నాయక్ పై నిర్భయ కేసు పెట్టాలి

First Published Jul 13, 2017, 1:33 PM IST
Highlights
  • శంకర్ నాయక్ మీద నిర్భయ కేసు పెట్టాలి.
  • పార్టీ అధ్యక్షుడి హోాదాలో కెసిఆర్ క్షమాపణ చెప్పాలి.
  • తెలంగాణలో మహిళలకు ఇస్తున్న గౌరవం ఇదేనా?

కలెక్టర్ ప్రీతిమీనా చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించిన అధికార పార్టీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై నిర్భయ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు టిడిపి నేత రేవంత్ రెడ్డి. రాష్ట్రం లో మహిళల పరిస్థితి ఎలా ఉందో నిన్న జరిగిన మానుకోట ఉదంతం బహిర్గతం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి స్పందన చాలా నామమాత్రంగా ఉందన్నారు. ఉపముఖ్య మంత్రిని, ఎంపీని ఎంజరిగిందో తెలుసుకోవాలని పురామయించడం శోచనీయమన్నారు. డిఎస్పీ స్థాయిలో విచారణ జరిపించి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాల్సింది పోయి మంత్రిని పంపుడేందని ప్రశ్నించారు. 

 

కలెక్టర్ సుమోటోగా కేసు స్వీకరించ వచ్చు కానీ, నిభందనల ప్రకారం పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. తక్షణమే శంకర్ నాయక్ పైన నిర్భయ చట్టం అమలు చేసి 506 కేసు నమోదు చేయాలన్నారు. కలెక్టర్ ను అవమానించిన ఎమ్మెల్యేను కేసీఆర్ సమర్థించకపోతే తక్షణమే పార్టీ నుండి బహిష్కరించి సిఎం చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యే మహిళా అధికారిని అవమానించినందుకు పార్టీ అధ్యక్షుడు గా కేసీఆర్ బహిరంగ  క్షమాపణ లు చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్.

click me!