భర్త మరణం, వేరొకరితో సహజీవనం.. పెళ్లికి ఒత్తిడి తెచ్చిందని, ఫలక్‌నుమా డ్యాన్సర్ హత్య కేసులో వీడిన మిస్టరీ

By Siva KodatiFirst Published Nov 9, 2021, 8:01 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ (hyderabad) ఫలక్‌నుమా (falaknuma )డ్యాన్సర్ ఫాతిమా హత్య కేసులో (fathima murder case) పోలీసులు పురోగతి సాధించారు. డ్యాన్సర్‌ను హత్య చేసిన క్యాబ్ డ్రైవర్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ (hyderabad) ఫలక్‌నుమా (falaknuma )డ్యాన్సర్ ఫాతిమా హత్య కేసులో (fathima murder case) పోలీసులు పురోగతి సాధించారు. డ్యాన్సర్‌ను హత్య చేసిన క్యాబ్ డ్రైవర్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ఏడాది క్రితం ఫాతిమా భర్త మరణించింది. దీంతో ఓ క్యాబ్ డ్రైవర్‌తో ఆమె సహజీవనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని క్యాబ్ డ్రైవర్‌ని ఫాతిమా ఒత్తిడి చేసినట్లుగా సమాచారం. అయితే డ్యాన్సులు ఆపేస్తే పెళ్లి చేసుకుంటానని క్యాబ్ డ్రైవర్ షరతు పెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో పెళ్లి విషయంగా ఇద్దరి మధ్యా కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఫాతిమాకు మద్యం తాగించిన క్యాబ్ డ్రైవర్ ఉరివేసి చంపేశాడు. 

కాగా.. మూడు రోజుల క్రితమే ఆమె ముస్తఫానగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుంది. ఆదివారం వస్తువులను షిఫ్ట్ చేసేందుకు పిల్లలను అమ్మమ్మ ఇంటి వద్ద ఉంచింది. ఆమె కొత్త ఇంటికి వచ్చి తిరిగి రాకపోవడంతో తల్లి వచ్చి చూసింది. ఆమె అప్పటికే శవమై కనిపించింది. ఫాతిమా మృతదేహం పక్కన బీర్ బాటిల్ కనిపించింది. దీంతో ఆమెను హత్య చేసి ఉంటారనే అనుమానంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే తండ్రి, తాజాగా తల్లి మరణించడంతో పిల్లలు అనాథలయ్యారు. 

ALso Read:హైదరాబాదులో డ్యాన్సర్ ది హత్యే: రేప్ అనుమానాలను కొట్టిపారేసిన పోలీసులు

మరోవైపు హైదరాబాదు (hyderabad) లోని పంజగుట్టలో (panjagutta) ఇటీవలే ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. దీపావళి పండుగనాడు ఓ చిన్నారి మృతదేహం కనిపించింది. మూసి ఉన్న దుకాణం ఎదురగా ఆమె శవం పడి ఉంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు చిన్నారిది హత్యేనని తేల్చారు. కడుపులో బలంగా తన్నడం వల్ల బాలిక మరణించినట్లు పోలీసులు తేల్చారు. బాలిక మరణించిన తర్వాత ఆమె శవాన్ని ఓ మహిళ తీసుకుని వచ్చి దుకాణం ముందు పడేసినట్లు గుర్తించారు. ఆ మహిళను గుర్తించడానికి సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

చిన్నారిని హత్య చేసిన దుండగులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వేరే చోట హత్య చేసి బాలిక శవాన్ని దుకాణం ముందు పడేశారని పోలీసులు గుర్తించారు. బాలికపై అత్యాచారం జరిగిన దాఖలాలు లేవని పోలీసులు చెప్పారు. మృతదేహంపై గాయాలు ఉండడం వల్ల హత్య చేసినట్లు భావిస్తున్నట్లు వారన్నారు.

click me!