
పెద్దపల్లి జిల్లాలో (peddapalli district) దారుణం జరిగింది. రామగుండం (ramagundam) కేకే నగర్ కాలనీలో పెళ్లికి నిరాకరించందనే అక్కసుతో ప్రియురాలిని గొంతుకోసి హత్యచేశాడో ప్రేమోన్మాది. కెకె నగర్‌కు చెందిన గొడుగు అంజలి అనే యువతి తారకరామారావు నగర్‌కు చెందిన చాట్ల రాజు అనే యువకుడు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అంజలిని పెళ్లి చేసుకోవాలంటూ రాజు వేధింపులకు గురిచేయటంతో రెండు సార్లు పంచాయతీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో రాజు ఇంట్లో చోరబడి అంజలిని (anjali) కత్తిపీటతో గొంతు కోసి హత్య చేశాడు. దీంతో అంజలి అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.