విద్యార్ధినితో అసభ్య ప్రవర్తన: హైద్రాబాద్‌లో ప్రైవేట్ కాలేజీ ప్రిన్సిపాల్ అరెస్ట్

Published : Jul 22, 2022, 03:47 PM ISTUpdated : Jul 22, 2022, 04:10 PM IST
 విద్యార్ధినితో అసభ్య ప్రవర్తన: హైద్రాబాద్‌లో ప్రైవేట్ కాలేజీ ప్రిన్సిపాల్ అరెస్ట్

సారాంశం

హయత్ నగర్ లోని ఓప్రైవేట్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆ కాలేజీలో  చదివే విద్యార్ధినితో అసభ్యంగా ప్రవర్తించిన విషయమై పోలీసులు కేసు నమోదు చేశారు. 

హైదరాబాద్: నగరంలోని హయత్ నగర్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్ధిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కాలేజీ ప్రిన్సిపాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  మూడు మాసాల క్రితం విద్యార్ధినికి మాయ మాటలు చెప్పి  కాలేజీ ప్రిన్సిపాల్ సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యనారాయణను  పోలీసులు  కోర్టులో హాజరుపర్చారు. 

మూడు మాసాల క్రితం ఇంటర్ సెకండియర్ స్టూడెంట్ ను సినిమాకు తీసుకెళ్లి ప్రిన్సిపాల్ అసభ్యంగా ప్రవర్తించాడు. మరో వైపు ఇటీవల స్పెషల్ క్లాస్ పేరుతో పిలిపించి వేధింపులకు పాల్పడినట్టుగా బాధితురాలు పేరేంట్స్ కు తెలిపింది. ఈ విషయమై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు  సత్యనారాయణను అరెస్ట్ చేశారు.  ఆయనను కోర్టులో హాజరుపర్చారు. కాలేజీ ప్రిన్సిపాల్ ఈ రకమైన వేధింపులకు పాల్పడితే తాము ఎవరికి చెప్పుకోవాలని విద్యార్ధినులు ఆవేదన చెందుతున్నారు.  విద్యార్ధినిపై అసభ్యంగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్ ను కఠినంగా శిక్షించాలని విద్యార్ధినులు కోరుతున్నారు. 

2013లో కూడా మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఇదే తరహా కేసు నమోదైంది. విద్యార్ధినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసులు నిందితుడిపై పోక్సో  చట్టం కింద కేసు నమోదు చేశారు. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్ధులను తన కాబిన్ లోకి పిలిపించి వేధింపులకు పాల్పడేవాడని బాధిత విద్యార్ధినులు పిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.2014లో హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో రిసెప్షనిస్టును లైంగికంగా వేధింపులకు పాల్పడిన ఘటనలో ప్రైవేట్ కాలేజీ ప్రిన్సిపాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.. 

హైద్రాబాద్ నగరంలోని  ఓ ప్రైవేట్ స్కూల్ లో కూడా ప్రిన్సిపాల్ కొడుకే మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయమై బాధిత విద్యార్ధిని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంతోష్ నగర్  పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బిస్కట్లు, చాకెట్లు ఆశచూపి  ఈ దారుణాలకు పాల్పడుతున్నాడు. మరో వైపు బాధిత విద్యార్ధినుల నగ్న వీడియోలను కూడా చిత్రీకరించారని పోలీసులు గుర్తించారు.దేశంలో పలు రాష్ట్రాల్లో ఇదే తరహాలో మహిళలు, బాలికలు, యువతులపై లైంగిక వేధింపులు చోటు చేసుకొంటున్నాయి. 

also read:హైద్రాబాద్‌లో దారుణం: చాకెట్లు ఆశ చూపి విద్యార్ధినులపై ప్రిన్సిపాల్ కొడుకు లైంగిక దాడి

విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువు స్థానంలో ఉన్నవారే ఈ రకమైన దారుణాలకు పాల్పడడంపై విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఎవరూ కూడా ఈ తరహ ఘటనలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని కూడా  విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  మరోవైపు కాలేజీలు, స్కూళ్లలో విద్యార్ధినులకు రక్షణ కల్పించాలని కూడా విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే