Etela Rajender: కాళేశ్వరం ముంపున‌కు కేసీఆర్ నే భాధ్యత వహించాలి: ఈటల రాజేందర్. 

Published : Jul 22, 2022, 02:59 PM IST
Etela Rajender: కాళేశ్వరం ముంపున‌కు కేసీఆర్ నే భాధ్యత వహించాలి: ఈటల రాజేందర్. 

సారాంశం

Etela Rajender: కాళేశ్వరం పంప్ హౌజ్ ల ముంపున‌కు కేసిఆర్ నే భాధ్యత వహించాల‌ని ఈటల రాజేందర్ అన్నారు. కాళేశ్వరం వచ్చి కన్నీళ్లు తెచ్చిందని,  రైతులు ఏడుస్తున్నార‌ని అన్నారు. నీటిపారుదల శాఖకు మంత్రి లేకపోవడం, సీజన్లో అధికారులు విదేశీ పర్యటనకు వెళ్ళడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శ‌మ‌ని అన్నారు.

జర్నలిస్టుల అధ్యయనం వేదిక ఆధ్వర్యంలో.. కాళేశ్వరం ముంపు మానవత తప్పిదమా - ప్రకృతి వైపరీత్యమా" అనే అంశంపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఈటెల రాజేందర్ హాజరయ్యారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నేనే పెద్ద ఇంజనీర్నీ, నేనే పెద్ద డిజైనర్నీ అని కేసీఆర్ ఎప్పుడు చెప్పేవారు. ఇంజనీర్లు చెప్పిన మాటలు సీఎం వినకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు.  కాళేశ్వరం, SRSP రివర్స్ పంపింగ్ వ‌ల్ల‌ ముంపున‌కు భాధ్యత వహించాలని అన్నారు.

గోదావరి నుండి కొండ పోచమ్మ వరకు నీటిని ఎత్తిపోస్తే ఎకరాకు  50 వేల రూపాయల కరెంట్ ఖర్చు అవుతుందనీ, పండే పంట కంటే కరెంటుకు ఎక్కువ ఖర్చు అవుతుందని విమ‌ర్శించారు.లిఫ్ట్ ల ద్వారానే పంటలు పండిస్తామంటే..  శుద్ధ తప్పని అన్నారు. సీఎం కేసీఆర్ నేనే ఇంజనీర్ అనే అహంకారంతో ఇంజనీర్ల సూచనలు పక్క‌న పెట్టి తన ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆరోపించారు. ముంపు ప్రాంతాల వారికి  శాశ్వత పరిష్కారం చూపించాల‌ని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. 
 
వరదలతో సంబంధం లేకుండా కాళేశ్వరం కాలువల పక్కన ఉన్న భూములు అన్నీ జాలు పట్టి కరాబ్ అవుతున్నాయి. ప్రభుత్వం కురస బుద్ది వల్ల కావల్సినంత భూమి సేకరణ చెయ్యలేదనీ, కాళేశ్వరం వచ్చి కన్నీళ్లు తెచ్చిందని, రైతులు ఏడుస్తున్నర‌ని, వారి గోడు తీర్చాలని డిమాండ్ ఈట‌ల డిమాండ్ చేశారు. సుందిల్ల, అన్నారం కట్టడం వల్లనే ప‌లు గ్రామాలు నీట మునిగాయని, దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే