హైద్రాబాద్‌లో 'గ్యాంగ్' సినిమా తరహలోచోరీ: ముగ్గురు నకిలీ సీబీఐ అధికారుల అరెస్ట్

By narsimha lodeFirst Published Dec 16, 2021, 9:41 AM IST
Highlights

సీబీఐ అధికారులని నగదు, బంగారం చోరీ చేస్తున్న ముగ్గురిని హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

హైదరాబాద్: సీబీఐ అధికారులమని చెప్పి బంగారం, నగదును దోచుకొంటున్న ముఠాలో ముగ్గురిని హైద్రాబాద్ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హైద్రాబాద్ గచ్చిబౌలిలోని ఆరెంజ్ కౌంటీలోCbi అధికారులమని Gold , Moneyను కాజేశారు కేటుగాళ్లు. సీబీఐ అధికారులమని నకిలీ గుర్తింపు కార్డులను తయారు చేసి దోపీడీకి పాల్పడ్డారు నిందితులు. నిందితులను Andhra pradesh రాష్ట్రంలోని West Godavari జిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. 

రెండు రోజుల క్రితం హైద్రాబాద్ నగరంలోని భువనతేజ ఇన్‌ఫ్రా ఛైర్మెన్ సుబ్రమణ్యం ఇంట్లోకి వచ్చిన ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఐటీ, సీబీఐ అధికారులమని  గంటన్నర పాటు తనిఖీలు నిర్వహించారు. లాకర్ తాళం తీసీ బంగారం, నగదును తీసుకొని వెళ్లిపోయారు.  సుబ్రమణ్యం వద్ద పనిచేస్తున్న వ్యక్తే కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు. సుబ్రమణ్యం వద్ద పనిచేసే జశ్వంత్ తన స్నేహితుడు సందీప్ తో కలిసి ఈ దోపీడీకి స్కెచ్ వేశాడు. సుబ్రమణ్యం వద్ద భారీగా బ్లాక్ మనీ ఉందని అనుమానించిన జశ్వంత్ ఈ దోపీడీకి ప్లాన్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. 

also read:సూర్య ‘గ్యాంగ్’ సినిమా తరహాలో దొంగతనం.. సీబీఐ పేరుతో బంగారం, వజ్రాలు, నగదుతో పరారీ..

సీబీఐ లేదా ఐటీ అధికారులైతే తనిఖీలు నిర్వహించిన తర్వాత నోటీసులు ఇస్తారు. కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే వెళ్లి పోవడంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదు, బంగారం ఆభరణాలను పక్కా ప్రణాళికతో చోరీ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.  ఈ మేరకు  సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితులను  పోలీసులను గుర్తించారు. నకిలీ సీబీఐ అధికారులుగా గుర్తింపు కార్డులను సృష్టించి  దోపీడీకి జశ్వంత్ కీలక పాత్రధారిగా పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. సుబ్రమణ్యం ఇంటి నుండి చోరీ చేసిన బంగారం, నగదును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

సినీ నటుడు సూర్య నటించిన ఓ సినిమాలో  ధనవంతులను లక్ష్యంగా చేసుకొని నకిలీ సీబీఐ అధికారుల అవతారం ఎత్తి డబ్బులు, బంగారాన్ని దోచుకొంటారు. సినిమాలో చూపినట్టుగానే  జశ్వంత్ గ్యాంగ్ కూడా సుబ్రమణ్యం ఇంట్లో అదే తరహలో దోపీడీకి పాల్పడింది. చివరకు పోలీసులకు చిక్కింది. ఈ ముఠాలో మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.ఇదే తరహలో రెండేళ్ల క్రితం కూడా హైద్రాబాద్ నగరంలోని ఎస్ఆర్ నగర్‌లో జ్యోతిష్యుడి ఇంట్లో కూడా 25 బంగారం దోపీడీ చేసి పారిపోయారు.   

రెండు నెలలుగా చోరీకి ప్లాన్

రెండు నెలలుగా జశ్వంత్ సుబ్రమణ్యం  ఇంట్లో చోరీకి  ప్లాన్ వేశాడు. సూర్య సినిమా తరహలోనే సీబీఐ అధికారులు ఈ చోరీకి పాల్పడ్డారు. నిందితులు ఉపయోగించిన ట్యాక్సీ నెంబర్ ప్లేట్ ను కూడా మార్చారు. తమ యజమాని సుబ్రమణ్యం వద్ద భారీగా బ్లాక్ మనీ ఉందని జశ్వంత్ భావించారు. చోరీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడని జశ్వంత్ భావించాడు. దీంతో నకిలీ సీబీఐ అధికారుల అవతారం ఎత్తి చోరీ చేశాడు.  నకిలీ సీబీఐ అధికారుల ముఠాలో హైద్రాబాద్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 


 


 


 

click me!