తెలంగాణ : 24 గంటల్లో 186 మందికి పాజిటివ్.. 6,78,874కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Dec 15, 2021, 10:50 PM ISTUpdated : Dec 15, 2021, 10:51 PM IST
తెలంగాణ : 24 గంటల్లో 186 మందికి పాజిటివ్.. 6,78,874కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

తెలంగాణ (Telangana)లో కొత్తగా 186 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయారు. 206 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,883 యాక్టివ్‌ కేసులు వున్నాయి

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 40,776 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 186 పాజిటివ్‌ కేసులు (corona cases) నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,78,874కి చేరింది. కోవిడ్ వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి తెలంగాణలో (corona deaths in telangana) కరోనా మృతుల సంఖ్య 4,010కి చేరింది. వైరస్ బారి నుంచి నిన్న 206 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,812 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  

గడిచిన 24 గంటల వ్యవధిలో ‘‘ఎట్‌ రిస్క్’’ దేశాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి 1,248 మంది చేరుకున్నారు. వీరికి ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా.. ముగ్గురు ప్రయాణికులకు కొవిడ్‌ నిర్ధారణ అయింది. తాజాగా వారితో కలిపి ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 6,644 మంది హైదరాబాద్ చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. వారిలో 21 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఇప్పటివరకు 15 మందికి ఒమిక్రాన్‌ నెగెటివ్‌గా తేలగా.. మరో ఆరుగురి ఫలితాలు రావాల్సి ఉంది.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 9, జీహెచ్ఎంసీ 63, జగిత్యాల 2, జనగామ 0, జయశంకర్ భూపాలపల్లి 3, గద్వాల 0, కామారెడ్డి 1, కరీంనగర్ 5, ఖమ్మం 10, మహబూబ్‌నగర్ 2, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 4, మంచిర్యాల 5, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 11, ములుగు 2, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 4, నారాయణపేట 0, నిర్మల్ 4, నిజామాబాద్ 4, పెద్దపల్లి 3, సిరిసిల్ల 2, రంగారెడ్డి 15, సిద్దిపేట 4, సంగారెడ్డి 6, సూర్యాపేట 3, వికారాబాద్ 2, వనపర్తి 4, వరంగల్ రూరల్ 4, హనుమకొండ 9, యాదాద్రి భువనగిరిలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి.  

 

PREV
click me!

Recommended Stories

Kavitha Comments: అలా చేస్తేనే మహిళలల రిజర్వేషన్ బిల్ వచ్చే ఆస్కారం | Asianet News Telugu
మహిళా రిజర్వేషన్ బిల్లుపై BJP Bandaru Vijayalakshmi Reaction | Telangana | Asianet News Telugu