పూజ పేరిట వివాహితకు తాళి కట్టిన కేటుగాడు: ఫోటోలతో బ్లాక్‌మెయిల్

Siva Kodati |  
Published : Sep 23, 2020, 07:50 PM ISTUpdated : Sep 23, 2020, 07:52 PM IST
పూజ పేరిట వివాహితకు తాళి కట్టిన కేటుగాడు: ఫోటోలతో బ్లాక్‌మెయిల్

సారాంశం

నిత్యం ఎన్నో ఉదంతాలు వెలుగు చూస్తున్నప్పటికీ, మూఢ నమ్మకాలతో దొంగ బాబాలు, పూజారులను ఆశ్రయించి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ఓ వివాహితను పూజారి వేధించాడు.

నిత్యం ఎన్నో ఉదంతాలు వెలుగు చూస్తున్నప్పటికీ, మూఢ నమ్మకాలతో దొంగ బాబాలు, పూజారులను ఆశ్రయించి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ఓ వివాహితను పూజారి వేధించాడు.

మాధవ్ అనే వ్యక్తి జ్యోతిష్యుడినంటూ బాధితురాలికి పరిచయమయ్యాడు. పూజలు చేయకపోతే భర్తకు ప్రమాదం జరుగుతుందంటూ మాధవ్ ఆ వివాహితకు మాయమాటలు చెప్పాడు. భర్త లేని సమయంలో పూజ పేరిట వివాహితకు తాళి కట్టాడు.

అనంతరం ఆ ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. తాళి కట్టిన ఫోటోలను చూపించి డబ్బులు ఇవ్వాలని ఆమె బ్లాక్ మెయిల్ చేశాడు. అతని వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాధవ్, అతనికి సహకరించిన రాఘవ్‌ను అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Raja Saab : నా చావు కోరుకుంటున్నారా? రాజాసాబ్ టికెట్ల రచ్చ.. తెగేసి చెప్పిన మంత్రి కోమటిరెడ్డి
Sankranti: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.? ఇలా వెళ్తే ట్రాఫిక్ త‌ప్పించుకోవ‌చ్చు