జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఎవరికీ షాకిస్తారో తెలియదు: జగ్గారెడ్డి

Published : Sep 23, 2020, 05:43 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఎవరికీ షాకిస్తారో తెలియదు: జగ్గారెడ్డి

సారాంశం

గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి షాకిస్తారో ఎవరికి తెలియదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి షాకిస్తారో ఎవరికి తెలియదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

బుధవారం నాడు ఆయన  హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. హైద్రాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం 15 వేల ఇళ్ళను కూడ చూపలేదన్నారు.గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులు లేక తమ పార్టీకి చెందిన వారిని టీఆర్ఎస్ లో చేర్చుకొన్నారని ఆయన గుర్తు చేశారు. 

టీఆర్ఎస్ వద్ద డబ్బులున్నాయి, ప్రతి ఓటుకు రూ. 10 వేలు ఇస్తారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ వద్ద డబ్బులు తీసుకొని కాంగ్రెస్ కు ఓటేయాలని ఆయన ప్రజలను కోరారు.  కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు బయట కన్పిస్తున్నారా... అని ఆయన ప్రశ్నించారు. 

also read:జాతీయ పార్టీ పెడితే కేసీఆర్ నవ్వులపాలౌతారు: జగ్గారెడ్డి

టీఆర్ఎస్ కు  ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీలోని ఆరు మంది ఎమ్మెల్యేలమే గట్టిగా సమాధానం చెబుతున్నామని ఆయన చెప్పారు.

ఎల్ఆర్ఎస్ ఛార్జీలను ఇంకా తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని ఆయన కోరారు. అంతేకాదు ఎల్ఆర్ఎస్ గడువును కూడ పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్