పవన్ కల్యాణ్ ఎడమ కంటికి ఆపరేషన్

Published : Jul 13, 2018, 06:46 AM ISTUpdated : Jul 13, 2018, 06:49 AM IST
పవన్ కల్యాణ్ ఎడమ కంటికి ఆపరేషన్

సారాంశం

 జనసేన అధినేత పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌కు హైదరాబాదులోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. కంటి సమస్యతో పది రోజుల క్రితం ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి వైద్యులను ఆయన సంప్రదించారు. 

హైదరాబాద్‌:  జనసేన అధినేత పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌కు హైదరాబాదులోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. కంటి సమస్యతో పది రోజుల క్రితం ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి వైద్యులను ఆయన సంప్రదించారు. 

ఎడమ కంటిలో కురుపు అయిందని, దానికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. దాంతో బుధవారం పవన్‌ ఆసుపత్రిలో చేరి కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు.

కాగా, ఉత్తరాంధ్రలో పోరాట యాత్ర చేస్తున్న పవన్ కల్యాణ్ తిరిగి తన యాత్రను ఈ నెల 16వ తేదీన ప్రారంభించే అవకాశాలున్నాయి. ఆయన ఇటీవల హైదరాబాదులో మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఆత్మీయ సదస్సులో పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu