ఇక గంటలు గంటలు క్యూలో నిలబడక్కర్లేదు.. జనరల్ టిక్కెట్లకు యాప్..

First Published Jul 12, 2018, 5:21 PM IST
Highlights

రిజర్వేషన్లు లేని సాధారణ ప్రయాణికులు కొత్తగా రూపొందించిన యూటీఎస్ ఆన్‌లైన్ యాప్ ద్వారా ఎక్కడికి కావాలంటే అక్కడికి సాధారణ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.. ఇది ప్రస్తుతానికి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మాత్రం అందుబాటులో ఉంది

రైళ్లలో ఎక్కడికైనా వెళ్లాలంటే రిజర్వేషన్లు చేసుకుంటాం.. ఇలాంటి వారి కోసం ఆన్‌లైన్, యాప్ సదుపాయం ఉంది. మరి సాధారణ ప్రయాణికుల పరిస్థితి ఏంటీ.. వీరు టిక్కెట్లు కొనాలంటే.. కౌంటర్‌లో గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోవాలి. ఒక రోజు ముందుగా అడ్వాన్స్ బుకింగ్ ఉన్నప్పటికీ. ఇక్కడ కూడా క్యూ కష్టాలు తప్పవు.. ఇకపై ఇలాంటి కష్టాలకు చరమగీతం పడింది రైల్వేశాఖ..

రిజర్వేషన్లు లేని సాధారణ ప్రయాణికులు కొత్తగా రూపొందించిన యూటీఎస్ ఆన్‌లైన్ యాప్ ద్వారా ఎక్కడికి కావాలంటే అక్కడికి సాధారణ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.. ఇది ప్రస్తుతానికి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మాత్రం అందుబాటులో ఉంది.. త్వరలో దేశవ్యాప్తంగా ఈ యాప్‌ను విస్తరించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది.

సికింద్రాబాద్‌ రైల్ నిలయంలో జరిగిన కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యూటీఎస్ యాప్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో దక్షిణ మధ్య రైల్వే ముందుందన్నారు.. జోన్ పరిధిలో యూటీఎస్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని.. అంతేకాకుండా ఫ్లాట్ ఫాం టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చన్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా దీనిని అమల్లోకి తీసుకువస్తామని జీఎం తెలిపారు.
 

click me!