ఏడేళ్ల క్రితం పెళ్లి, ఆరునెలలుగా మరొకరితో ప్రేమ.. వివాహానికి ఒప్పుకోలేదని.. ఇద్దరూ ఆత్మహత్య...

Published : Sep 12, 2022, 10:55 AM IST
ఏడేళ్ల క్రితం పెళ్లి,  ఆరునెలలుగా మరొకరితో ప్రేమ.. వివాహానికి ఒప్పుకోలేదని.. ఇద్దరూ ఆత్మహత్య...

సారాంశం

పెళ్లైన తరువాత ఏడేళ్లకు మళ్లీ ప్రేమలో పడ్డాడో వ్యక్తి. కానీ, ఈ ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. 

గజ్వేల్ : తల్లిదండ్రులు తమ ప్రేమను నిరాకరించారని ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలం అడవి మజీద్ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో శనివారం వెలుగుచూసింది. ఎస్ఐ రంగాకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  ములుగు మండలంలోని మామిడాల ఆర్అండ్ బీ కాలనీకి చెందిన గొట్టి మహేష్ (28)కు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం అతని భార్య కృష్ణవేణి గర్భవతి. కాగా మహేష్ ఆరునెలలుగా మార్కుక్ కు చెందిన పదిరి స్వప్న (19)ను ప్రేమిస్తున్నాడు. ఇరువురు పెళ్లి  చేసుకోవాలని  నిర్ణయించుకున్నారు.

 తాను స్వప్నను పెళ్లి చేసుకుంటానని మహేష్ తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ వారు నిరాకరించారు. స్వప్న తల్లిదండ్రులు సైతం ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మహేష్ శనివారం తెల్లవారుజామున తమ బంధువు నవీన్ ను తాము ఉరేసుకుంటున్న స్థలం లొకేషన్ను వాట్సాప్ లో పంపించాడు. అడవి మజీద్ శివారులోని అటవీ ప్రాంతంలో వేప చెట్టుకు మహేష్, స్వప్న ఉరివేసుకున్నారు. కాగా, మృతులకు ములుగు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని అన్నారు. ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు మృతదేహాలను అప్పగించామని తెలిపారు. 

అన్నాచెల్లెళ్లను ఒకేసారి కాటేసిన పాము.. ఆదిలాబాద్ లో విషాదం..

కాగా, వివాహేతర సంబంధంతో మరిది చేతిలో వదిన దారుణ హత్యకు గురైన ఘటన బెంగళూరులోని హుబ్లీ జిల్లాలోని కుందగోళ తాలూకా ఏరినారాయణపుర గ్రామంలోచోటు చేసుకుంది. హతురాలు సునంద మెణసినకాయి.  కాగా  నిందితుడిని మంజునాథగా గుర్తించారు.  కుటుంబ కలహాలు తీవ్రస్థాయికి చేరడంతో ఈ హత్య జరిగిందని తెలుస్తోంది. కొడవలితో పట్టపగలే హత్య జరగడంతో గ్రామంలో భయాందోళనకు పరిస్థితులు నెలకొన్నాయి. కుందగోళ  పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి,  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  హత్యకు కారణం వివాహేతర సంబంధమా?  లేక మరేదైనా కారణమా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. 

కాగా ఇలాంటి ఘటనే ఆగస్ట్ లో విశాఖపట్నంలో చోటుచేసుకుంది.  రైలు కిందపడి  ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇష్టపడిన యువకుడితో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేసింది.  అయితే, సదరు యువకుడు గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. జిఆర్పీ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం  వివరాలు ఇలా ఉన్నాయి… గోపాలపట్నం సమీపంలోని  కొత్తపాలేనికి చెందిన  కొణతాల హేమలత (25) భర్తతో విభేదాల కారణంగా రెండేళ్లక్రితం వెళ్ళిపోయింది.  విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళ పాలెంలోని పుట్టింట్లో ఉంటుంది. ఆమె బ్యూటీషియన్ గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో కోటనరవకు చెందిన ఆటో డ్రైవర్ కె. కుమార్ తో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. 

ఈ క్రమంలోనే ఘటన జరిగిన ముందురోజు అమ్మగారి ఇంటి నుంచి హేమలత బయటకు వెళ్లి కుమార్ను కలిసింది. ఇద్దరూ కలిసి సతివానిపాలెం రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లి రాత్రంతా గడిపారు. మరుసటిరోజు వేకువజామున ఇద్దరూ ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో ఇద్దరు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఇద్దరూ కలిసి ట్రాక్స్  మీద పడుకున్నారు. అయితే రైలు రావడం ఆలస్యం కావడంతో ఇద్దరూ సమీపంలోని బడ్డీ వద్దకు వచ్చి కాసేపు గడిపారు. మళ్లీ కాసేపటి తర్వాత ఆత్మహత్యాయత్నానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆఖరి క్షణంలో మనసు మార్చుకున్న కుమార్ ఆ ప్రయత్నం విరమించుకుందామని హేమలతను వెనక్కి లాగే ప్రయత్నం చేశాడు. కానీ హేమలత ససేమిరా అని రైలుకు ఎదురుగా వెళ్ళింది. ఈ గ్రామంలో ఇద్దరికీ పెనుగులాట జరిగింది. రైలు వేగంగా రావడంతో ట్రాక్ మీద ఉన్న హేమలతను బలంగా ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అదే సమయంలో కుమార్ పక్కకి ఉండడంతో రైలు వేగానికి తుళ్ళి రాళ్ళపై పడిపోయాడని.. జిఆర్ పి పోలీసులు భావిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu