టీఆర్ఎస్‌లో చేరికపై స్పందించిన అజారుద్దీన్: కొద్దిసేపట్లో కేసీఆర్‌తో భేటీ

By Siva KodatiFirst Published Sep 27, 2019, 7:09 PM IST
Highlights

తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలపై భారత మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ స్పందించారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో గెలుపొందని అనంతరం అజహర్ మీడియాతో మాట్లాడుతూ.. కాసేపట్లో తన ప్యానెల్ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తానన్నారు

తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలపై భారత మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ స్పందించారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో గెలుపొందని అనంతరం అజహర్ మీడియాతో మాట్లాడుతూ.. కాసేపట్లో తన ప్యానెల్ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తానన్నారు.

రాష్ట్రానికి కేసీఆర్ బాస్ అని.. టీఆర్ఎస్‌లో చేరికపై ఇప్పుడేం మాట్లాడలేనని పేర్కొన్నారు. సీఎం రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి గురించే మాట్లాడుతానని అజహర్ స్పష్టం చేశారు.

తెలంగాణ ముందస్తు ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ కాంపైనర్ గా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అజారుద్దీన్ ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలవ్వడంతో అజారుద్దీన్ అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎలాంటి నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు అజారుద్దీన్.

సంబంధిత వార్తలు:

తెలంగాణలో కాంగ్రెస్ కు భారీ షాక్: గుడ్ బై చెప్పనున్న అజారుద్దీన్
 

click me!