టీఆర్ఎస్ లో టికెట్ల చిచ్చు... పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో మాజీ ఎంపి

By Arun Kumar PFirst Published Sep 8, 2018, 5:47 PM IST
Highlights

అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్దమైన టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే టికెట్లు ఆశించి భంగపడ్డ పలువురు నాయకులు ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. ఈ జాబితాలోకి మరో సీనియర్ నాయకుడు చేరారు. మాజీ ఎంపీని తనను కాదని వేరే వారికి టికెట్ కేటాయించడంతో గుర్రుగా వున్న ఈ నాయకుడు అదును చూసుకుని పార్టీ మారడానికి సిద్దమయ్యారని సమాచారం.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలనుకున్నారు మాజీ ఎంపి రమేష్ రాథోడ్. అయితే కేసీఆర్ మాత్రం ఆయనకు కాదని రేఖా నాయక్ ను టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో మనస్థాపానికి గురైన రమేష్ టీఆర్ఎస్ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరడానికి సిద్దమయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఖానాపూర్ టికెట్ ఇస్తానంటేనే టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు రమేష్ తెలిపారు. కానీ పార్టీ నాయకత్వం తనకు అన్యాయం చేసిందని ఆయన ఆరోపిస్తున్నారు.అయితే ఎట్టి  పరిస్థితుల్లో ఖానాపూర్ నియోజకవర్గం నుండే పోటీ చేసి తన బలమేంటో చూపిస్తానంటున్నారు రమేష్.

ఖానాపూర్ లో రేఖా నాయక్ కమీషన్ల కోసం ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని, ప్రజల్లో ఆమెపై వ్యతిరేకత ఉన్నట్లు ఆరోపించారు. కార్యకర్తలతో సమావేశమై తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నట్లు రమేష్ రాథోడ్ స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం కింది లింక్ క్లిక్ పై క్లిక్ చేయండి

కాంగ్రెస్ గూటికి మరో మాజీ ఎమ్మెల్యే.... ఫలించిన ఉత్తమ్ వ్యూహం

click me!