కొండా సురేఖకు అన్యాయం చేశారు: డికె అరుణ

By pratap reddyFirst Published Sep 8, 2018, 5:41 PM IST
Highlights

కొండా సురేఖకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అన్యాయం చేసిందని కాంగ్రెసు తెలంగాణ నేత డికె అరుణ అన్నారు. టీఆర్ఎస్ కు మహిళలపై గౌరవం లేదని ఆమె శనివారం మీడియా సమావేశంలో విమర్శించారు.

హైదరాబాద్‌: కొండా సురేఖకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అన్యాయం చేసిందని కాంగ్రెసు తెలంగాణ నేత డికె అరుణ అన్నారు. టీఆర్ఎస్ కు మహిళలపై గౌరవం లేదని ఆమె శనివారం మీడియా సమావేశంలో విమర్శించారు.  కేసీఆర్‌ ముందస్తు ముహూర్తం ఏ క్షణంలో పెట్టుకున్నాడో కానీ ఆ పార్టీకి ఒక్క అంశం కూడా కలిసిరావడం లేదని ఆమె అన్నారు. 

ఎన్ని సభలు పెట్టినా టీఆర్‌ఎస్‌ బలం రోజురోజుకి తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్‌ చెప్పే అబద్దాలన్నీప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధిని కేసీఆర్‌ చేసినట్లు చెప్పుకుంటున్నారని అన్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను పెంచి ప్రజలను హింసిస్తున్నాయని టీపీసీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బట్టి విక్రమార్క విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌ రేట్ల పెంపుకు నిరసనగా అన్ని పార్టీలతో కలిసి కాంగ్రెస్‌ ఈ నెల 10న భారత్‌ బంద్‌కు పిలుపు ఇచ్చిందని ఆయన శనివారం మీడియా సమావేశంలో చెప్పారు. 


వ్యవసాయం చేసుకునే రైతుకు ఎకరాకు 60 లీటర్ల డీజిల్‌ ఖర్చవుతుందని, రేట్ల పెంపుతో వారిపై భారం పడుతుందని ఆయన అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ద్వారానే తెలంగాణ ప్రభుత్వం 10 వేల కోట్ల రూపాయన భారాన్ని ప్రజలపై మోపుతుందని ఆరోపించారు. 


దేశంలోని మిగతా 22 రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ఎక్కువ పన్నులు విధిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పెట్రో, డీజిల్‌ రేట్లను తగ్గిస్తామని హామి ఇచ్చారు.

click me!