రేవంత్‌పై పోలీసులకు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఫిర్యాదు.. కారణమిదే

Siva Kodati |  
Published : Aug 27, 2022, 03:56 PM IST
రేవంత్‌పై పోలీసులకు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఫిర్యాదు.. కారణమిదే

సారాంశం

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందన్న రేవంత్ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పీఎస్‌లో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందన్న రేవంత్ వ్యాఖ్యలపై ఆయన ఫిర్యాదు చేశారు. దేవాలయంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగలేదని విష్ణు స్పష్టం చేశారు. రేవంత్ వ్యాఖ్యలు తప్పని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

9 రోజులు.. కానీ 8 నైవేద్యాలే.. బతుకమ్మ వేడుకల్లో ఒక రోజు నైవేద్యం ఎందుకు ఉండదో తెలుసా?
Dasara Special Trains: గుడ్ న్యూస్ చెప్పిన భారతీయ రైల్వే.. దసరా బతుకమ్మ ప్రత్యేక రైళ్లు