నువ్వు గజ్వేల్‌లో వేలు పెడితే .. నేను సిద్ధిపేటలో వేలు పెడతా : హరీశ్‌రావుకు ఈటల రాజేందర్ కౌంటర్

Siva Kodati | Published : Nov 5, 2023 6:38 PM

మంత్రి హరీశ్ రావు తనకు వ్యతిరేకంగా గజ్వేల్‌లో ప్రచారం చేస్తే.. హరీశ్‌కు వ్యతిరేకంగా తాను సిద్ధిపేటలో ప్రచారం నిర్వహిస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హెచ్చరించారు. 

Google News Follow Us

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఆదివారం ఆయన గజ్వేల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తానూ కేసీఆర్ బాధితుడినేనని వ్యాఖ్యానించారు. గజ్వేల్‌లోని ప్రతి ఇంట్లో కేసీఆర్ బాధితులు వున్నారని.. వారందరికీ అండగా నిలుస్తానని ఈటల హామీ ఇచ్చారు. గజ్వేల్‌లో తాను తిరిగిన ప్రతి చోటా ప్రజలు తమ ఓట్లు నాకే వేస్తానని అంటున్నారని .. అక్కడే కేసీఆర్ ఓటమి ఖాయమైందని రాజేందర్ జోస్యం చెప్పారు. 

పదేళ్లలో కేసీఆర్‌కు నియోజకవర్గ ప్రజలు గుర్తుకురాలేదని.. ఎన్నికల సమయంలో గుర్తొస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తాను గజ్వేల్‌లో పోటీ చేస్తుండటంతో బీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని రాజేందర్ పేర్కొన్నారు. మంత్రి హరీశ్ రావు తనకు వ్యతిరేకంగా గజ్వేల్‌లో ప్రచారం చేస్తే.. హరీశ్‌కు వ్యతిరేకంగా తాను సిద్ధిపేటలో ప్రచారం నిర్వహిస్తానని ఈటల హెచ్చరించారు. ఇదే సమయంలో అధికారులు చట్టప్రకారం నడుచుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ ప్రాంతంలో 30 వేల మంది రైతులు భూములను కోల్పోయారని ఈటల రాజేందర్ ఆరోపించారు. 

Read more Articles on