సీతక్కకు చంద్రబాబు స్పెషల్ విషెస్..

Published : Jul 10, 2021, 08:54 AM IST
సీతక్కకు చంద్రబాబు స్పెషల్ విషెస్..

సారాంశం

ట్విటర్ వేదికగా స్పందించిన ఆయన.. తెలంగాణ మహిళా నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.   

ములుగు ఎమ్మెల్యే సీతక్క పుట్టిన రోజు సందర్భంగా.. ఆమెకు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విటర్ వేదికగా స్పందించిన ఆయన.. తెలంగాణ మహిళా నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. 

గిరిజనుల, ఆదివాసీల, పేదల బాధలు తీర్చడానికి అహర్నిశలు శ్రమించే సీతక్క సేవాగుణం స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. ప్రజలే సర్వస్వంగా భావించే సీతక్క నిండు నూరేళ్ళూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. 

 

కాగా.. ఆయన ట్వీట్ కి సీతక్క కూడా స్పందించారు.  ‘థాంక్యూ సోమచ్ అన్నా’ అంటూ రిప్లై ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్ అంత ఉన్న దేశం.. ప్ర‌పంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఎలా మారింది.?
Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?