తెలంగాణ: రేపటి కేసీఆర్ వాసాలమర్రి పర్యటన వాయిదా

Siva Kodati |  
Published : Jul 09, 2021, 10:13 PM IST
తెలంగాణ: రేపటి కేసీఆర్ వాసాలమర్రి పర్యటన వాయిదా

సారాంశం

దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో రేపటి  తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా పడింది. ఇందుకు సంబంధించిన కారణాలు తెలియాల్సి వుంది. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపటి వాసాలమర్రి పర్యటన వాయిదా పడింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. రేపు అక్కడ ఏర్పాటు చేసిన గ్రామ సభలో సీఎం పాల్గొనాల్సి వుంది. కేసీఆర్ పర్యటన సందర్భంగా వాసాలమర్రిలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అధికార పార్టీ నేతలతో పాటు అధికారులు, దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 

కాగా, వాసాలమర్రి అభివృద్ది కోసం జిల్లా కలెక్టర్  పమెలా పత్పతిని ప్రత్యేక అధికారిగా నియమిస్తున్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. జూన్ 22న వాసాలమర్రి గ్రామస్తులతో సీఎం కేసీఆర్  సహపంక్తి భోజనం చేశారు. అనంతరం గ్రామస్తుల సమస్యలను ఆయన తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Also Read:దత్తత గ్రామంపై కేసీఆర్ ఫోకస్.. రేపు మరోసారి వాసాలమర్రికి తెలంగాణ సీఎం

గ్రామాభివృద్ది కోసం కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు.  ఈ కమిటీలు గ్రామాభివృద్ది కోసం గ్రామస్తులతో చర్చించి ప్లాన్ తయారు చేసుకోవాలని  ఆయన కోరారు. జిల్లా కలెక్టర్  గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ  గ్రామాభివృద్ది కోసం  సహకరిస్తారని చెప్పారు. అంకాపూర్ లో ఏర్పాటు చేసిన గ్రామాభివృద్ది కమిటీలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలతో పాటు  జగిత్యాల జిల్లాల్లో కూడ ఈ తరహ కమిటీలు ఏర్పాటైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

 

PREV
click me!

Recommended Stories

Brahmanandam Spech: వెంకయ్య నాయుడుపై బ్రహ్మానందం పంచ్ లు | Asianet News Telugu
Venkaiah Naidu Attends Sankranti: ఈ చిన్నారి రికార్డ్ చూసి వెంకయ్య నాయుడు షాక్| Asianet News Telugu