మొరాయిస్తున్న ఈవీఎంలు...ఎంపీలు, ఎమ్మెల్యేల పడిగాపులు

By Arun Kumar PFirst Published Dec 7, 2018, 7:57 AM IST
Highlights

తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. సాంకేతిక కారణాలతో ఈవీఎంలు పనిచేయకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలింగ్ ఆలస్యమవుతోంది. 
 
ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, కొత్తగూడెం కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీంతో ఆయా కేంద్రాల్లో ఓటేయడానికి వెళ్లిన ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా క్యూలైన్ లోనే వేచిచూడాల్సి వస్తోంది. వీరితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మిగతా ప్రజా ప్రతినిధులు కూడా తమ ఓటుహక్కును  వినియోగించుకోడానికి పడిగాపులు పడుతున్నారు. 

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 2.81 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 11 తారీఖున జరిగే ఓట్ల లెక్కింపు ద్వారా అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 
 
సంబంధిత వార్తలు

కొడంగల్ లో మెురాయించిన ఈవీఎంలు

తెలంగాణ ఎన్నికలు: ప్రారంభమైన పోలింగ్

click me!