తెలంగాణ ఎన్నికలు: ఓటేసిన నందమూరి సుహాసిని

By sivanagaprasad kodatiFirst Published Dec 7, 2018, 7:51 AM IST
Highlights

తెలంగాణ ఎన్నికల పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి సుహాసిని మెహదీపట్నంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తెలంగాణ ఎన్నికల పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి సుహాసిని మెహదీపట్నంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల కల్లా పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆమె క్యూలో నిల్చొని ఓటు వేశారు.

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 119 శాసనసభ స్థానాల్లో... 1821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 55,329 ఈవీఎంలు, 42,751 వీవీప్యాట్‌లు అందుబాటులో ఉంచారు.

ఓటర్, పోలింగ్ బూత్‌ల సమాచారం కోసం నా ఓటు యాప్‌‌ను వినియోగించుకోవాల్సిందిగా అధికారులు తెలిపారు.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 279 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు, 30 వేల మంది రాష్ట్ర పోలీసులు, 5 రాష్ట్రాల నుంచి 18,860 మంది బలగాలను మోహరించారు. దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు, బ్రెయిలీ లిపీలో ఎపిక్ కార్డ్స్, సైన్ బోర్డ్స, ర్యాంపులు ఏర్పాటు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో 2 లక్షల మంది ఉద్యోగులు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా తొలిసారిగా ఓటు ఎవరికి వేశామో పోలింగ్ కేంద్రంలోనే తెలుసుకునేందుకు వీలుగా వీవీ ప్యాట్‌లను ఏర్పాటు చేశారు. సీసీటీవీ, వెబ్‌ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారు.
 

click me!