తుమ్మినా, దగ్గినా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది.. అందుకే ఎంఐఎంతో లోపాయికారి ఒప్పందం - కిషన్ రెడ్డి

By Asianet News  |  First Published Dec 9, 2023, 12:35 PM IST

Kishan reddy : తుమ్మినా, దగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అందుకే ఎంఐఎం ను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయబోరని తెలిపారు.


Kishan reddy : కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మినా, దగ్గినా పడిపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎంతో లోపాయికారి ఒప్పందం చేసుకుందని ఆయన ఆరోపించారు. అక్బరుద్దీన్ ఒవైసీని అందుకే ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేశారని తెలిపారు. నూతన అసెంబ్లీకి ఎంపికైన వారిలో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. వారందరినీ కాదని అక్బరుద్దీన్ కు ఎందుకు ఈ అవకాశం ఇచ్చారని అన్నారు.

తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయింపు.. కొత్త ఐటీ మినిస్టర్ ఆయనే..

Latest Videos

బీజేపీ ఆఫీసులో కిషన్ రెడ్డి శనివారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తమ పార్టీ ఎంతో ఆదరించారని చెప్పారు. అందుకే తమకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు ఇస్తే.. ఈ సారి 8 సీట్లు ఇచ్చారని అన్నారు. తమకు ఓటు బ్యాంకు కూడా 6 నుంచి 14 శాతానికి పెరిగిందని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటును పునరావృతం చేసిందని చెప్పారు. శాసన సభ గౌరవాన్ని కాలరాసిందని ఆరోపించారు.

బీఆర్ఎస్ ఎల్పీ నేతగా మాజీ సీఎం కేసీఆర్..

తుమ్మినా, దగ్గినా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. అందుకే ఎంఐఎంను మచ్చిక చేసుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆ పార్టీతో లోయికారి ఒప్పందం చేసుకుందని, అందుకే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేసిందని కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. దీనిని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని ఆయనకు ఎలా ప్రొటెం స్పీకర్ గా అవకాశం ఇస్తారని ప్రశ్నించారు. అందుకే మొదటి రోజు సమావేశాలను తమ పార్టీ బహిష్కరిస్తుందని చెప్పారు. అక్బరుద్దీన్ సమక్షంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయబోరని తెలిపారు. శాశ్వత స్పీకర్ వచ్చిన తరువాత బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని తేల్చి చెప్పారు.

Live: Press Meet, State Office, Nampally, Hyderabad. https://t.co/CBdYXCqAuT

— G Kishan Reddy (@kishanreddybjp)
click me!