హుజురాబాద్‌లో కాంగ్రెస్ నాయకుడు కాసిపేట శ్రీనివాస్ చేరిక సందర్భంగా తాను చేసిన ప్రసంగాన్ని కొన్ని వార్త ఛానళ్లు, సోషల్ మీడియాలోని కొన్ని వర్గాలు వక్రీకరించాయని ఈటల రాజేందర్ అన్నారు. ఇది సరికాదని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై ఆయన యూటర్న్ తీసుకున్నారు.
హుజూరాబాద్: హుజూరాబాద్ సభలో తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించడంతో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ఆయన వ్యాఖ్యలపై వస్తున్న వార్తలకు వివరణ ఇస్తూ ఆయన గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
హుజురాబాద్‌లో కాంగ్రెస్ నాయకుడు కాసిపేట శ్రీనివాస్ చేరిక సందర్భంగా తాను చేసిన ప్రసంగాన్ని కొన్ని వార్త ఛానళ్లు, సోషల్ మీడియాలోని కొన్ని వర్గాలు వక్రీకరించాయని ఈటల రాజేందర్ అన్నారు. ఇది సరికాదని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై ఆయన యూటర్న్ తీసుకున్నారు.
undefined
"నేను గులాబీ సైనికుడిని. మా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ముమ్మాటికీ గులాబీ జెండానే ఎగురుతుంది. నేను పార్టీలో చేరిననాటి నుంచి.. నేటి వరకు గులాబీసైనికుడినే. మా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే" అని వివరించారు.
"ఇటీవల కాలంలో కొన్ని వార్తపత్రికలలో, సోషల్ మీడియాలో మా పార్టీ అంటే గిట్టనివాళ్లు, నా ఎదుగుదలను ఓర్వలేనివారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఒక కులానికి ప్రతినిధిని అన్నట్టు, డబ్బులకు ఆశపడే వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే నేను ఈ రోజు హుజురాబాద్‌లో మాట్లాడాను" అని అన్నారు.
"చిల్లరవార్తలు వద్దని చెప్పాను. తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యే నాటికే నేను పది లక్షల కోళ్ల ఫారానికి యజమానినని చెప్పిన. కమలాపుర్ (ప్రస్తుత హుజురాబాద్) నియోజకవర్గానికి నన్ను పంపించి, ఇక్కడ పోటీచేయించి గెలిపించింది మా నాయకుడు కేసీఆర్ గారే. ఇదే విషయాన్ని కూడా చెప్పిన" అని అన్నారు.
"మేము గులాబీ సైనికులమని చెప్పిన. రాజకీయాల్లో సంపాదించుకోవడానికి రాలేదు.. నేను పార్టీలో, ఉద్యమంలో చేరేనాటికి పారిశ్రామికవేత్తనని చెప్పిన. ఓ పార్టీనాయకుడు ఇటీవల పత్రికలో వచ్చిన కథనంపై స్పందించాలని వేదికపై కోరడంతో ఆ పత్రికపై నేను చేసిన కామెంట్లపై రంధ్రాన్వేషణ చేస్తున్నారు. ఇది సరికాదు" అని అన్నారు.
"ఆనాడు పార్టీ మారాలని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అనేక రకాలుగా ఒత్తడి తెచ్చినా లొంగని వ్యక్తి ఈటల రాజేందర్. ఈ ఉద్యమ పుణ్యానే నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన. నిరాధారమైన వార్తలను ప్రసారం చేయడం ఆపాలి, సోషల్ మీడియా సంయమనంతో ఉండాలి. నా ప్రసంగపాఠాన్ని పూర్తిగా చూడండి" అని ఈటల అన్నారు.
సంబంధిత వార్త
కేసీఆర్‌కు షాక్: ఈటల సంచలన కామెంట్స్