మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో పాగాకు బీజేపీ ప్లాన్

By narsimha lodeFirst Published Aug 30, 2019, 7:08 AM IST
Highlights

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించేందుకు ప్లాన్  చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 

హైదరాబాద్:త్వరలో తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమౌతోంది. ఈ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది.

సెప్టెంబర్ మూడో తేదీనీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం కానుంది.ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహన్ని ఖరారు చేయనున్నారు.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన  జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఒక్క అసెంబ్లీ స్థానానికి మాత్రమే పరిమితమైంది. కానీ, ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంది.

పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీజేపీ నాయకత్వంలో ఆశలను కల్పించాయి. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పై పోరాటం చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వస్తాయని కాషాయదళం భావిస్తోంది.

మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీ నాయకత్వం ఇప్పటికే బ్లూఫ్రింట్ ను రెడీ చేసింది. ఈ ఎన్నికల కోసం కేంద్ర మంత్రి అమిత్ షా తో కొన్ని సభలను నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా పార్టీ నాయకత్వానికి కొన్ని సూచనలు చేశారు. బూత్ స్థాయి నాయకత్వంపై కేంద్రీకరించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో 142 మున్సిపాలిటీల్లో త్వరో జరిగే ఎన్నికల్లో తాము మంచి పోటీని ఇస్తామని ఆ పార్టీ నేతలు నాయకత్వంతో ఉన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవడం టీఆర్ఎస్ అంత సులభం కాదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్ వీ వీవీఎస్ ప్రభాకర్ రావు అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని సాధించనుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రారావు ధీమాను వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము ప్రచార వ్యూహన్ని ఖరారు చేసినట్టుగా ఆయన తెలిపారు.


 

click me!