ట్రాన్స్‌కో సీఎండీని కాల్చిపారేయాలన్న రేవంత్: విద్యుత్ ఉద్యోగుల ఫైర్

Published : Aug 29, 2019, 08:34 PM ISTUpdated : Aug 29, 2019, 09:14 PM IST
ట్రాన్స్‌కో సీఎండీని కాల్చిపారేయాలన్న రేవంత్: విద్యుత్ ఉద్యోగుల ఫైర్

సారాంశం

ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుపై కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విద్యుత్ శాఖ ఉద్యోగులు భగ్గుమన్నారు. కాల్చమనడం మీ సంస్కృతా అని వారు ప్రశ్నించారు. సీఎండీపై వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు

తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లపై మంటలు చల్లారడం లేదు. ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుపై కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విద్యుత్ శాఖ ఉద్యోగులు భగ్గుమన్నారు. కాల్చమనడం మీ సంస్కృతా అని వారు ప్రశ్నించారు. సీఎండీపై వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

గురువారం మీడియాతో మాట్లాడిన రేవంత్.. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు లేవని టీఆర్ఎస్ బుకాయిస్తోందని మండిపడ్డారు. చత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో రాష్ట్రానికి తీవ్ర నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదే విషయాన్ని అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడ చెప్పారని ఆయన గుర్తు చేశారు. చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం తెర వెనుక అదానీ,  తెర ముందు ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం ఉందని  ఆయన చెప్పారు.

చత్తీస్‌గఢ్ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టమని ఈఆర్‌సీకి కూడ ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు. విద్యుత్ ను కేసీఆర్ తన ఆర్దిక వనరుగా మార్చుకొన్నారని ఆయన విమర్శించారు.

విద్యుత్ కొనుగోళ్ల విషయంలో టీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ప్రభాకర్ రావు అబద్దాలు చెబుతున్నారని.. ఆయనను గన్‌పార్క్ ముందు నిలబెట్టి కాల్చినా తప్పులేదంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. 

ట్రాన్స్‌‌కో సీఎండీప్రభాకర్‌రావును కాల్చినా తప్పులేదు: రేవంత్ రెడ్డి

PREV
click me!

Recommended Stories

అభిమాని కోరికతీర్చిన Pawan Kalyan.. గంటలోనే Niranjan కి ట్యాబ్, కుక్కపిల్ల | Asianet News Telugu
IMD Rain Alert : రుతుపవనాలు అలర్ట్, ద్రోణి ఎఫెక్ట్ .. ఈ ప్రాంతాల్లో ఇక వర్షబీభత్సమే