రాజ్‌భవన్‌లో జస్టిస్ ఎన్వీరమణను కలిసిన కేసీఆర్.. యాదాద్రికి రావాల్సిందిగా ఆహ్వానం

Siva Kodati |  
Published : Jun 13, 2021, 05:51 PM IST
రాజ్‌భవన్‌లో జస్టిస్ ఎన్వీరమణను కలిసిన కేసీఆర్.. యాదాద్రికి రావాల్సిందిగా ఆహ్వానం

సారాంశం

తెలంగాణ రాజ్ భవన్‌లో విడిది చేసిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాద పూర్వకంగా కలిశారు. జస్టిస్ రమణను యాదాద్రి దర్శనానికి కేసీఆర్ ప్రత్యేకంగా ఆహ్వానించారు.

తెలంగాణ రాజ్ భవన్‌లో విడిది చేసిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాద పూర్వకంగా కలిశారు. జస్టిస్ రమణను యాదాద్రి దర్శనానికి కేసీఆర్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాదుల సంఘాల ప్రతినిధులు, బార్ కౌన్సిల్ సభ్యులు కూడా జస్టిస్ రమణను కలిసి అభినందించారు. దేశంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 70 శాతం అంటే 24 నుంచి 42 పెంచినందుకు వారు జస్టిస్ రమణకు కృతజ్ఞతలు తెలిపారు. దీనివల్ల తెలంగాణ ప్రజలకు సత్వర న్యాయం చేకూరుతుందని, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని కేసీఆర్ అన్నారు.

Also Read:ఈ నెల 14న యాదాద్రికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ: వెంట తమిళిసై, కేసీఆర్.. భారీ స్వాగత ఏర్పాట్లు

న్యాయమూర్తుల ఎంపికలో సామాజిక న్యాయానికి, వైవిద్యానికి పెద్దపీట వేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు దిశానిర్దేశం చేసినందుకు జస్టిస్ రమణకు పలు సంఘాల ప్రతినిధులు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తులు భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణను సత్కరించారు. సీజేఐ హోదాలో తెలుగు రాష్ట్రాలలో తన తొలి పర్యటనలో భాగంగా జస్టిస్ రమణ యాదాద్రి, శ్రీశైలం పుణ్య క్షేత్రాలను కూడా సందర్శించనున్నారు.

PREV
click me!

Recommended Stories

Heat Wave Alert : అసలుసిసలైన ఎండలు షురూ.. ఈ జిల్లాల్లో ఏకంగా 40 డిగ్రీలు, ఎల్లో అలర్ట్
పేమెంట్ అయిన‌ట్లు సౌండ్ వ‌స్తుంది కానీ డ‌బ్బులు ప‌డ‌వు.. ఫోన్‌పేలో కొత్త స్కామ్‌. జాగ్ర‌త్త‌!