అడిషనల్ కలెక్టర్లకు కొత్త కార్లు.. స్వయంగా అందజేయనున్న కేసీఆర్

Siva Kodati |  
Published : Jun 13, 2021, 05:05 PM ISTUpdated : Jun 14, 2021, 03:06 PM IST
అడిషనల్ కలెక్టర్లకు కొత్త కార్లు.. స్వయంగా అందజేయనున్న కేసీఆర్

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలోని అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణ‌యించారు. దీనిలో భాగంగా 32 కొత్త కియా కార్నివాల్ కార్లకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఈ మేరకు వాటిని ఆదివారం ప్రగతి భవన్‌కు తెప్పించారు.

తెలంగాణ రాష్ట్రంలోని అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణ‌యించారు. దీనిలో భాగంగా 32 కొత్త కియా కార్నివాల్ కార్లకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఈ మేరకు వాటిని ఆదివారం ప్రగతి భవన్‌కు తెప్పించారు. సీఎం కేసీఆర్‌.. ప్రగతిభవన్‌లో అదనపు కలెక్టర్లు, డీపీఓలతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే అదనపు కలెక్టర్లకు కేసీఆర్ స్వయంగా వాహనాలు అందజేయనున్నారు.

Also Read:రెండేళ్లు టైమిచ్చా.. ఇక ఏ అధికారిని ఉపేక్షించను, త్వరలోనే తనిఖీలకు వస్తున్నా: కేసీఆర్

ఇదిలావుంటే.. పల్లె, పట్టణ ప్రగతి పురోగతి, అధికారుల పనితీరు, నిధుల వినియోగం, భవిష్యత్ కార్యాచరణపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో అధికారులతో చర్చిస్తున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లక్ష్యాలు, సాధించిన విజయాలు, ఇంకా చేపట్టాల్సిన పనులు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్న నిధుల ఖర్చు, హరితహారం, శ్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం తదితర అంశాలపై సీఎం సమీక్షించి.. పెండింగ్‌ పనుల పూర్తిపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు

అయితే, రాష్ట్రం ఆర్థిక సమస్యను ఎదుర్కుంటున్న ప్రస్తుత తరుణంలో అదనపు కలెక్టర్లకు లగ్జరీ కార్లను ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

Heat Wave Alert : అసలుసిసలైన ఎండలు షురూ.. ఈ జిల్లాల్లో ఏకంగా 40 డిగ్రీలు, ఎల్లో అలర్ట్
పేమెంట్ అయిన‌ట్లు సౌండ్ వ‌స్తుంది కానీ డ‌బ్బులు ప‌డ‌వు.. ఫోన్‌పేలో కొత్త స్కామ్‌. జాగ్ర‌త్త‌!