20 ఏళ్ల రాజకీయ జీవితం.. ఒకరి జోలికి వెళ్లింది లేదు: ఈటల వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jun 22, 2021, 10:04 PM IST
Highlights

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరి జోలికి వెళ్లబోమని స్పష్టం చేశారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ గొడవలకు తావు ఇవ్వలేదని రాజేందర్ గుర్తుచేశారు. 

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరి జోలికి వెళ్లబోమని స్పష్టం చేశారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ గొడవలకు తావు ఇవ్వలేదని రాజేందర్ గుర్తుచేశారు. కుల సంఘాల మీటింగులు పెట్టి, అంగట్లో మాదిరిగా అందరినీ కొంటున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు అంటున్నారని రాజేందర్ విమర్శించారు. ఐఏఎస్ అధికారులను కూడా కేసీఆర్ బానిసలుగా చేసుకున్నారని ఆయన విమర్శించారు. ఎవరో పెట్టిన చీమల పుట్టలోకి ఈటల వచ్చాడని ఒకరు అంటున్నారని, చీమల పుట్ట నేను పెట్టానా, నువ్వు పెట్టావా అంటూ ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కాగా, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికే కాదు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రస్తుతం హుజురాబాద్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ(మంగళవారం) వీణవంక మండలంలో పర్యటిస్తున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. భారీ ర్యాలీగా వెళుతుండగా డిజె కు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో ఈటల అనుచరులు, బిజెపి నాయకులు పోలీసులతో వాగ్విదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

Also Read:ఈటల రాజేందర్ ను అడ్డుకున్న పోలీసులు... వీణవంకలో ఉద్రిక్తత (వీడియో)

వీణవంక మండలంలోని వల్బపూర్ గ్రామానికి ఈటల రాగాబిజెపి నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుండి వీణవంక వరకు ర్యాలీగా వెళ్తున్న క్రమంలో ర్యాలీలో డిజే కు పర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన బిజెపి కార్యకర్తలకు పోలీసులతో తీవ్ర వాగ్వివాదానికి దిగుతూ పోలీసు వాహనాన్ని చుట్టుముట్టారు. అయితే పోలీసులు మాత్రం వెనక్కి తగ్గకుండా  సౌండ్ ఎక్కువ పెట్టకుండా కేబుల్ ను తొలగించారు.

click me!