తెలంగాణలో పడిపోయిన కరోనా కేసులు: కొత్తగా 1,175 మందికి పాజిటివ్.. జీహెచ్ఎంసీలో అత్యధికం

Siva Kodati |  
Published : Jun 22, 2021, 09:32 PM IST
తెలంగాణలో పడిపోయిన కరోనా కేసులు: కొత్తగా 1,175 మందికి పాజిటివ్.. జీహెచ్ఎంసీలో అత్యధికం

సారాంశం

తెలంగాణలో కరోనా కేసులు దాదాపుగా తగ్గుముఖం పట్టినట్లుగానే కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,24,907 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,175 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. 

తెలంగాణలో కరోనా కేసులు దాదాపుగా తగ్గుముఖం పట్టినట్లుగానే కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,24,907 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,175 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 133 కొత్త కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 76 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 1,771 మంది కరోనా నుంచి కోలుకోగా, 10 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 3,586కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,15,574 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,95,348 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 16,640 యాక్టివ్ కేసులు వున్నాయి. తెలంగాణలో కరోనా కేసుల రికవరీ రేటు ప్రస్తుతం 96.71 శాతంగా ఉంది. 

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 5, భద్రాద్రి కొత్తగూడెం 70, జీహెచ్ఎంసీ 133, జగిత్యాల 32, జనగామ 12, జయశంకర్ భూపాలపల్లి 24, గద్వాల 5, కామారెడ్డి 4, కరీంనగర్ 74, ఖమ్మం 76, ఆసిఫాబాద్ 3, మహబూబ్‌నగర్ 26, మహబూబాబాద్ 51, మంచిర్యాల 41, మెదక్ 9, మేడ్చల్ మల్కాజిగిరి 68, ములుగు 28, నాగర్ కర్నూల్ 13, నల్గగొండ 70, నారాయణపేట 7, నిర్మల్ 5, నిజామాబాద్ 6, పెద్దపల్లి 64, సిరిసిల్ల 25, రంగారెడ్డి 74, సిద్దిపేట 27, సంగారెడ్డి 17, సూర్యాపేట 74, వికారాబాద్ 18, వనపర్తి 16, వరంగల్ రూరల్ 23, వరంగల్ అర్బన్ 41, యాదాద్రి భువనగిరిలో 34 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ఇక యుద్ధం మొదలు | Kavitha New Political Party | Asianet News Telugu
ఒక్క క్లిక్.. జీవితం మటాష్! | Hyderabad CP VC Sajjanar Warning | IPL betting | Asianet News Telugu