యాదాద్రి: అడ్డగూడురు లాక‌ప్‌డెత్.. ముగ్గురు పోలీసులపై వేటు

Siva Kodati |  
Published : Jun 22, 2021, 08:28 PM IST
యాదాద్రి: అడ్డగూడురు లాక‌ప్‌డెత్.. ముగ్గురు పోలీసులపై వేటు

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురు లాకప్‌డెత్‌పై రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు పోలీసులను ఆయన సస్పెండ్ చేశారు. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురు లాకప్‌డెత్‌పై రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు పోలీసులను ఆయన సస్పెండ్ చేశారు. అడ్డగూడురు ఎస్సై మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్య‌లపై వేటు వేశారు. లాకప్‌డెత్‌పై మల్కాజిగిరి ఏసీపీ విచారణ విచారణ చేస్తారని ఆయన ఆదేశాల్లో తెలిపారు. అడ్డగూడురులో పీఎస్‌లో 3 రోజుల క్రితం మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. మరియమ్మ మృతిపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. 

PREV
click me!

Recommended Stories

బిఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్ట్... ఏమిటీ ప్లెక్సీ వివాదం?
Rice Prices: బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? మరింత పెరుగుతాయా?