బీజేపీ వైపు నేతల చూపు: ఈటల సహా ఆ నేతలంతా కమలం గూటికి?

By narsimha lodeFirst Published May 26, 2021, 1:33 PM IST
Highlights

మాజీ మంత్రి  ఈటల రాజేందర్‌ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది.  బీజేపీ జాతీయ నాయకులు కొందరు ఈటల రాజేందర్ మాట్లాడినట్టు ప్రచారం సాగుతోంది. 

హైదరాబాద్: మాజీ మంత్రి  ఈటల రాజేందర్‌ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది.  బీజేపీ జాతీయ నాయకులు కొందరు ఈటల రాజేందర్ మాట్లాడినట్టు ప్రచారం సాగుతోంది. భూకబ్జా  ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్  ను కేసీఆర్ మంత్రివర్గం నుండి తప్పించారు. ఈటల రాజేందర్  కేబినెట్ నుండి తప్పించిన తర్వాత ఆయన  పలు పార్టీల నేతలను కలిశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలతో పాటు  పలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలను కూడ ఈటల రాజేందర్ కలిశారు.  తనకు మద్దతివ్వాలని ఆయన ఆయా పార్టీల నేతలను కోరారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే  తాము మద్దతివ్వబోమని బీజేపీ నేతలు స్పష్టం చేసినట్టుగా  తెలుస్తోంది. 

also read:ఈటల గారూ... ఆత్మగౌరవం అంటే ఇదేనా..: వకుళాభరణం ఎద్దేవా

పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి చెందిన ఫామ్ హౌస్ లో ఈటల రాజేందర్  కొందరు బీజేపీ నేతలతో ఇటీవల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈటల రాజేందర్ తో  పలువురు బీజేపీ నేతలు చర్చించినట్టుగా సమాచారం. ఈటల రాజేందర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు ఓ ట్రావెల్స్ యజమాని కూడ బీజేపీలో చేరే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈటల రాజేందర్ తో రాష్ట్ర స్థాయికి చెందిన కొందరు బీజేపీ నేతలు చర్చించారు. జాతీయ నేతలు కూడ ఈటలతో చర్చించారని సమాచారం. 

కరోనా కేఃసులు తగ్గిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తు గురించి ప్రకటన చేస్తానని ఈటల రాజేందర్ గతంలో ప్రకటించారు. అయితే ఇప్పటికిప్పుడే  హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసే అవకాశం లేదు. అప్పటివరకు తన రాజకీయ భవిష్యత్తుకు ఏ పార్టీ సరైందో నిర్ణయించుకొని ఆ పార్టీలో చేరాలనే యోచనలో ఈటల రాజేందర్ ఉన్నారనే ఆయన సన్నిహితులు చెబుతున్నారు.రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ అయితే  తనకు అండగా ఉంటుందనే అభిప్రాయంతో ఈటల రాజేందర్ ఉన్నారనే అభిప్రాయంతో ఆయన ఉన్నారనే ప్రచారం సాగుతోంది. బీజేపీలో చేరుతారనే ప్రచారంపై ఈటల రాజేందర్  నుండి ఇంకా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

click me!