జూడాల డిమాండ్లను పరిష్కరించాలి: మాజీ మంత్రి ఈటల రాజేందర్

Published : May 26, 2021, 12:47 PM IST
జూడాల డిమాండ్లను పరిష్కరించాలి: మాజీ మంత్రి ఈటల రాజేందర్

సారాంశం

జూనియర్ డాక్టర్ల సమ్మెకు  మాజీ మంత్రి  ఈటల రాజేందర్ మద్దతు ప్రకటించారు. ఈ విషయమై ఆయన  బుధవారం నాడు ఆయన  ఓ ప్రకటనను విడుదల చేశారు.   


హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమ్మెకు  మాజీ మంత్రి  ఈటల రాజేందర్ మద్దతు ప్రకటించారు. ఈ విషయమై ఆయన  బుధవారం నాడు ఆయన  ఓ ప్రకటనను విడుదల చేశారు. కరోనా కష్టకాలంలో మీరు అందించిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని ఆయన డాక్టర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రాణాలను ఫణంగా పెట్టి చికిత్స చేస్తున్నారని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి ఇంకా పోలేదన్నారు. ఇలాంటి సమయంలో సమ్మె చేస్తే  ప్రజలు ఇబ్బంది పడతారని ఈటల రాజేందర్ చెప్పారు. ఈ విషయమై పునరాలో చన చేయాలని ఆయన జూనియర్ డాక్టర్లను కోరారు. 

also read:సమ్మె బాట పట్టిన తెలంగాణ జూనియర్ డాక్టర్లు: ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో సర్కార్

జూనియర్ డాక్టర్ల సమస్యలపై  ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన  డిమాండ్ చేశారు. పెంచిన స్టైఫండ్ ను వెంటనే అందించాలని ఆయన కోరారు. తాను ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నంత కాలం డాక్టర్లు,వైద్య సిబ్బందికి   ఎలాంటి సమస్య వచ్చినా చర్చించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకొన్నట్టుగా ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం జాడాల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!