కరాచి బేకరీపై కేసు నమోదు

First Published Oct 5, 2017, 11:53 AM IST
Highlights
  • కరాచి బేకరీ బ్రాంచ్ లపై తూనికలు కొలతల శాఖ తనిఖీలు
  • 4 కరాచీ బేకరీలలోని 18 ఫుడ్ ఐటమ్స్ పై కేసులు


హైదరాబాద్ లోని కరాచీ బేకరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే బంజారాహిల్స్ లోని కరాచి బేకరి బ్రాంచ్ లో బ్రెడ్ ప్యాకెట్ పై ముద్రించిన తేది వివాదాస్పదమైంది. నిన్న అంటే అక్టోబర్  4 వ తేదీన కొనుగోలు చేసిన బ్రెడ్‌ ప్యాకెట్‌ పై అక్టోబర్ 5న తయారు చేసినట్టు  ముద్రించిన విషయం తెలిసిందే. ఈ అంశం సోషల్ మీడియాలో బాగా ప్రచారం కావడంతో తూనికలు,కొలతలు శాఖ అధికారులు స్పందించారు.
తూనికలు కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ భాస్కర్ రెడ్డి ఆద్వర్యంలో సోషల్ మీడియాలో వచ్చిన ముందు తేదీ ప్యాకింగ్ ఆధారంగా  తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ పరిధిలోనే కాకుండా రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాల పరిధిలోని 14 కరాచీ బ్రాంచీలపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో  4 కరాచీ బేకరీలలోని 18 ఫుడ్ ఐటమ్స్ పై కేసులు నమోదు చేశారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భాస్కర్ రెడ్డి తెలిపారు.
 

click me!