ఏపీ సీఎం ను రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా !

Published : Feb 04, 2017, 12:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
ఏపీ సీఎం ను రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా !

సారాంశం

నోటుకు ఓటు కేసులో ఇరుక్కున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు  ప్లేటు ఫిరాయించే ఆలోచన చేస్తున్నాడా.. స్వయంగా పార్టీ అధినేతనే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా...    

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తెలంగాణ తెలుగు దేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా...?

 

కరుడగట్టిన టీడీపీ వ్యతిరేకులు కూడా ఇప్పటి వరకు ఈ ఆరోపణలు చేయలేదు. అయితే రేవంత్ రెడ్డితో

 

చాలా ఏళ్లుగా టీడీపీలో కలసి పనిచేసేన ప్రముఖ నేతే ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

ఆయన మరెవరో కాదు ఒకప్పుడు టీడీపీలో ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు.

 

ఓటుకు కోట్లు కేసులో అప్రూవర్ గా మారుతానంటూ చంద్రబాబునాయుడును రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బోగస్ ప్రచారం చేయడంలో రేవంత్ ఆరితేరారని విమర్శించారు.

 

ఇటీవల ఎర్రబెల్లి మళ్లీ టీడీపీ లోకి జంప్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఆయన ఆ వార్తలు అన్నీ నిరాదారణమని మీడియాకు విడుదల చేసిన ఓ లేఖలో స్పష్టం చేశారు.

 

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను కలసిన మాట వాస్తవమేనని అయితే తమ మధ్య స్నేహం రాజకీయాలకు అతీతమైందని వివరణ ఇచ్చారు.

 

అయితే , రేవంత్ మీద కక్ష తీర్చుకోడానికే ఎర్రబెల్లి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా... లేక నిజంగా చంద్రబాబును రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది.

 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు