బీటెక్ విద్యార్ధినిపై ఆటోడ్రైవర్ రేప్, రోడ్డుపై వివస్త్రగా బాధితురాలు

By Siva KodatiFirst Published Feb 10, 2021, 9:53 PM IST
Highlights

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. బీటెక్ విద్యార్ధినిపై ఓ ఆటోడ్రైవర్ ఆత్యాచారం చేశాడు. బాధితురాలు ఘట్‌కేసర్‌‌కు సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నట్లుగా తెలుస్తోంది

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. బీటెక్ విద్యార్ధినిపై ఓ ఆటోడ్రైవర్ ఆత్యాచారం చేశాడు. బాధితురాలు ఘట్‌కేసర్‌‌కు సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

సాయంత్రం కాలేజ్ నుంచి ఇంటికి వస్తుండగా దారుణం చోటు చేసుకుంది. జీడిమెట్ల పొదల్లోకి లాక్కెళ్లి ఆటోడ్రైవర్‌ ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం బట్టలు లేకుండా రోడ్డుపైనే అమ్మాయిని వదిలిపెట్టి పరారయ్యాడు సదరు కామాంధుడు.

ఆమెను గమనించిన స్థానికులు బాధితురాలిని మేడిపల్లి క్యూర్ హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

click me!