అప్పులు తీర్చలేక యువ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన హైదరాబాద్ లో జరిగింది. వరంగల్ కు చెందిన ఓ ఇంజినీర్ గ్రాడ్యుయేట్ హైదరాబాద్ లోని ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్ : ‘తెలిసీ తెలియక అప్పులు చేశా.. వాటిని తీర్చలేకపోతున్నా.. చాలా అబద్ధాలు చెప్పా.. నా మాటలన్నీ నాటకమే.. దయచేసి అర్థం చేసుకోండి.. అమ్మా, నాన్న, గుడి, తమ్ముళ్లు జాగ్రత్త..’ అంటూ లేఖ రాసి ఓ ఇంజనీరింగ్ పట్టభద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాలపురం సీఐ సాయి ఈశ్వర్ గౌడ్ వివరాల ప్రకారం.. వరంగల్ కాశీబుగ్గకు చెందిన మామిడి లక్ష్మీసాయి (22) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఎంతకీ ఉద్యోగం రాలేదు. మరో ఇంటర్వ్యూ ఉందని గతనెల 31న నగరానికి వచ్చాడు. గురుద్వారా ప్రాంతంలోని లోటస్ గ్రాండ్ హోటల్ లో దిగాడు. రెండు రోజుల నుంచి కనిపించలేదు.
అద్దె చెల్లించకపోవడంతో గురువారం రూమ్ బాయ్ శ్యామ్ తలుపులు కొట్టాడు. లక్ష్మీసాయి స్పందించకపోవడంతో హోటల్ యజమానికి చెప్పారు. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గది తలుపులు బద్దలు కొట్టి చూడగా.. బాత్ రూంలో బైండింగ్ వైర్ తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. అతని వద్ద సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. సోమవారం రాత్రి చివరి ఫోన్ కాల్ ఉండటంతో అదే రోజు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చునని భావిస్తున్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
undefined
ఉస్మానియా ఆసుపత్రిలో దారుణం: రోగి బంధువుపై ప్రైవేట్ అంబులెన్స్ యజమాని దాడి
కాగా, ఇలాంటి ఘటనే జూన్ లో హైదరాబాద్ లో జరిగింది. ఒకేరోజు తల్లీకొడుకు బలవన్మరణానికి పాల్పడిన హృదయవిదారక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వ్యాపారంలో నష్టం రావడంతో మొదట సందీప్ ఉరివేసుకున్నాడు. దాన్ని తట్టుకోలేక తల్లి బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగి సుమారు మూడు రోజులయి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలుకి చెందిన పీ వరప్రసాద్ భార్య సరళ, కుమారుడు సందీప్ హైదరాబాదులోని కేపీహెచ్ బి ఠాణా పరిధిలోని బృందావన్ కాలనీ రిషి కళ్యాణి రెసిడెన్సీ లో నివాసం ఉంటున్నారు. సరళ గృహిణి, కాగా సందీప్ వ్యాపారి.
అశాంతిని రగిల్చేలా పీఎఫ్ఐ కార్యకలాపాలు.. నిజామాబాద్ లో వెలుగులోకి...నలుగురు అరెస్ట్...
ఘటన జరిగిన రోజు ఉదయం వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వచ్చిన కుటుంబం స్నేహితులు ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటం గమనించారు. కర్నూలులో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మాదాపూర్లో ఉంటున్న సరళ సోదరుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెట్రోలింగ్ పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా సరళ(59) వంటగదిలో, సందీప్ (35) పడక గదిలో ఉరేసుకుని కనిపించాడు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించలేని విధంగా మారాయి. వాటిని తరలించేందుకు పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది చాలా ఇబ్బంది పడ్డారు. వాచ్ మెన్ కు గురువారం సాయంత్రం సందీప్ అపార్ట్మెంట్ నిర్వహణ ఖర్చులు ఇచ్చాడు. అప్పటి నుంచి తల్లి, కుమారుడు ఇంటి నుంచి బయటకు రాలేదు. వరప్రసాద్ కర్నూలులో రైసుమిల్లు నడుపుతున్నారు.