టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్: రెండు మూడు రోజుల్లో రంగంలోకి ఈడీ

By narsimha lode  |  First Published Mar 31, 2023, 5:12 PM IST

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ కేసులో ఈడీ  కూడా విచారించే అవకాశం లేకపోలేదు.  బేగంటపేట పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా  ఈడీ కేసు నమోదు  చేసే అవకాశం ఉందని  ప్రచారం సాగుతుంది.
 



హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్  కేసులో  ఈడీ కూడ రంగంలోకి దిగే అవకాశం ఉంది.  పేపర్ లీక్ విషయంలో  హవాలా రూపంలో  డబ్బులు చేతులు మారినట్టుగా  అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీంతో   ఈడీ   రంగప్రవేశం  చేయనుంది.  మరో వైపు ఈ కేసులో  ఈడీ దర్యాప్తు  చేయాలని  కాంగ్రెస్ నేతలు కోరారు.  

టీఎస్‌పీఎస్ సీ పేపర్ లీక్ అంశంపై   పలువురి నుండి నిందితులు డబ్బులు వసూలు  చేసినట్టుగా  సిట్ గుర్తించింది. ఏఈ పేపర్ లీక్ అంశంలో  రూ. 25 లక్షలను  ఢాక్యానాయక్ వసూలు  చేసినట్టుగా నిట్ గుర్తించింది.  ఈ కేసు విషయమై  బేగంపేట పోలీసులు నమోదు చేసిన  ఎఫ్ఐఆర్ ఆధారంగా  ఈడీ అధికారులు  ఈసీఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది.  పేపర్ లీక్ కు సంబంధించి  డబ్బులను హవాలా రూపంలో తరలించారని  దర్యాప్తు  అధికారులు అనుమానిస్తున్నారు.  ఈ కేసులో  ఈడీ దర్యాప్తుపై  రెండు మూడు రోజుల్లో  స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ పేపర్ లీక్ అంశంపై  దర్యాప్తు  చేయాలని  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  ఈడీని కోరారు  ఇవాళ   మధ్యాహ్నం ఈడీ అధికారులకు  ఈ మేరకు  రేవంత్ రెడ్డి వినపత్రం సమర్పించారు. 

Latest Videos

 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్   లో  పేపర్ లీక్ అంశాన్ని  మరింత లోతుగా దర్యాప్తు  చేయాలని  సిట్  భావిస్తుంది.  ఈ కేసులో  13 మందిని అరెస్ట్  చేశారు.   అరెస్టైన వారిలో  మరికొందరిని   సిట్  బృందం  కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.  ప్రస్తుతం  సిట్  కస్టడీలోనే  రమేష్ ఉన్నాడు. గత  వారంలో  రమేష్, సురేష్, షమీమ్ లను  సిట్  బృందం  అరెస్ట్  చేసింది.

ఈ నెల  మొదటి వారంలో  టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ అంశం  వెలుగు చూసింది.  తొలుత  టీఎస్‌పీఎస్‌సీలో కంప్యూటర్లు  హ్యాక్ అయ్యాయని  అనుమానించారు. అయితే  పోలీసుల విచారణలో  కంప్యూటర్లు  హ్యాక్ కాలేదని  గుర్తించారు.  పేపర్ లీక్ అయిందని  పోలీసులు గుర్తించారు. ఈ నెల  12, 15, 16 తేదీల్లో  జరగాల్సిన  పరీక్షలను వాయిదా వేశారు. అయితే  ఈ నెల  5న  జరిగిన  ఏఈ ప్రశ్నాపత్రం లీక్ అయినట్టుగా  గుర్తించి ఈ పరీక్షను రద్దు  చేశారు.   ఈ కేసులో  తొలుత  9 మందిని అరెస్ట్  చేశారు. ఆ తర్వాత   నలుగురిని అరెస్ట్  చేశారు.

also read:టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్‌లో కీలక పరిణామం: బోర్డు సభ్యులను విచారించనున్న సిట్

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ అంశం  తెరమీదికి రావడంతో   కొన్ని పరీక్షలను  రద్దు చేయగా, మరికొన్ని  పరీక్షలను  వాయిదా వేశారు. వాయిదా వేసిన  పరీక్షలకు సంబంధించి న షెడ్యూల్ ను  రెండు రోజుల క్రితం  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్ మాసం నుండే  టీఎస్‌పీఎస్‌సీలో  పేపర్ లీక్ అవుతున్నాయనే ప్రచారం కూడా లేకపోోలేదు.ఈ విషయమై  సిట్ బృందం  దృష్టి కేంద్రీకరించింది. పేపర్ లీక్  అంశంపై  బోర్డు సభ్యులు,  అధికారుల  నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా  సిట్  దర్యాప్తు  నిర్వహించే అవకాశం లేకపోలేదు.
 

click me!