తప్పదనుకుంటే బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు : జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Mar 31, 2023, 04:44 PM IST
తప్పదనుకుంటే బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు : జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుపై మాజీ మంత్రి జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పదనుకుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయన్నారు. మరి దీనిపై హస్తం నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

త్వరలో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో పొత్తులపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పదనుకుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయన్నారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ పొత్తును ప్రజలే నిర్ణయిస్తారని జానారెడ్డి వ్యాఖ్యానింనచారు. దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయని ఆయన అన్నారు. రాహుల్‌పై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేయడాన్ని కేసీఆర్, కేటీఆర్, కవిత ఖండించారని జానారెడ్డి గుర్తుచేశారు. 

కాగా.. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత  బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య  పొత్తులుంటాయని  వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో  ఏ పార్టీకి  పూర్తి మెజారిటీ రాదన్నారు. హంగ్ అసెంబ్లీ  వస్తుందని ఆయన  జోస్యం  చెప్పారు. సెక్యులర్ పార్టీలుగా  ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య పొత్తులు కుదిరే అవకాశం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో  కలకలానికి కారణమయ్యాయి. ఈ వ్యవహారంపై గతంలోనే తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జీ మాణిక్ రావు థాక్రే స్పందించారు.

ALso REad: పొత్తు వ్యాఖ్యలు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మాణిక్ రావు థాక్రే షాక్

పొత్తులపై చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి ఉపసంహరించుకున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులుండవని మాణిక్ రావు తెలిపారు. ప్రస్తుతం నేతలంతా ఐక్యంగా వున్నారని.. నాయకులంతా త్వరలోనే పాదయాత్రలు చేస్తారని థాక్రే స్పష్టం చేశారు. బీజేపీ లాంటి శక్తులు పొత్తుల పేరుతో తమను వీక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని థాక్రే పేర్కొన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేంత బలం కాంగ్రెస్‌కు వుందని ఆయన స్పష్టం చేశారు. 

అయితే.. తాను చేసిన వ్యాఖ్యలను మాణిక్ రావు థాక్రే లైట్ గా తీసుకున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. థాక్రేతో భేటీ తర్వాత ఆయన ఆ విధంగా చెప్పారు. తమ పార్టీ వాళ్లు కూడా  తన వీడియోను పూర్తిగా చూడలేదని.. వచ్చే ఎన్నికల్లో  ఎవరితో కూడా పొత్తు పెట్టుకోవద్దని  తాను థాక్రేకు చెప్పానన్నారు. బీఆర్ఎస్ తో పొత్తుపై తాను  చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి చర్చ జరగలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాకు తెలిపారు. గత ఎన్నికల్లో  టీడీపీతో  పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టపోయినట్టుగా  ఠాక్రేకు వివరించినట్టుగా ఆయన చెప్పారు. పొత్తులపై తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదన్నారు. అయితే, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని థాక్రే మీడియాతో చెప్పారు. దీన్ని బట్టి వెంకట్ రెడ్డితో థాక్రే కొంత మేరకు కఠినంగానే మాట్లాడినట్లు అర్థమవుతోంది.
 

PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu