ఢిల్లీ లిక్కర్ స్కాం: హైద్రాబాద్‌లో కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు

By narsimha lode  |  First Published Mar 23, 2024, 10:11 AM IST

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు  ఇవాళ  దేశంలోని పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. 


న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు శనివారం నాడు  న్యూఢిల్లీ, హైద్రాబాద్ లో  సోదాలు నిర్వహిస్తున్నారు.  న్యూఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్, హైద్రాబాద్‌లో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంధువుల ఇళ్లలో  సోదాలు నిర్వహిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈ నెల  15వ తేదీన ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టైన కవితను ఈడీ అధికారులు  తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇవాళ్టితో  కవిత కస్టడీ ముగియనుంది.ఇవాళ ఈడీ అధికారులు  కవితను కోర్టులో హాజరుపర్చనున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో  కవితపై  ఈడీ అధికారులు ఆరోపణలు చేస్తున్నారు.  సౌత్ లాబీలో కవిత కీలకంగా వ్యవహరించారని ఈడీ అధికారులు  ఆరోపణలు చేస్తున్నారు.ఈ ఆరోపణలను కవిత ఖండించిన విషయం తెలిసిందే. 

Latest Videos

undefined

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  తొలుత సీబీఐ అధికారులు  కవితను  సాక్షిగా విచారించారు.ఆ తర్వాత ఈ కేసులో  ఈడీ అధికారులు కవితను విచారించారు.  ఈ కేసులో  అరెస్టైన ఇతరులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితపై ఈడీ అధికారులు అభియోగాలు మోపారు.

ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ, హైద్రాబాద్‌లలో  ఇవాళ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  ఈ కేసులో  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను రెండు రోజుల క్రితం  ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు కస్టడీ కోరారు. ఇందుకు  కోర్టు అనుమతిని ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై  తనపై దర్యాప్తు సంస్థలు చేసిన ఆరోపణలను  కేజ్రీవాల్ తోసిపుచ్చారు.  ఈడీ నోటీసులను రాజకీయ ప్రేరేపితంగా పేర్కొన్న విషయం తెలిసిందే. తొమ్మిది దఫాలు  ఈడీ అధికారులు కేజ్రీవాల్ కు  నోటీసులు ఇచ్చింది. అయితే  చివరకు  రెండు రోజుల క్రితం కేజ్రీవాల్ నివాసంలో  సోదాలు నిర్వహించి ఆయనను అరెస్ట్ చేశారు.

 

click me!